సెలక్ట్‌ చేసి చివరి నిమిషంలో హ్యాండిచ్చేవారు: హీరోయిన్‌ | Sakshi
Sakshi News home page

హీరో ప్రియురాలు, స్టార్‌ కిడ్‌ను సెలక్ట్‌ చేసి నన్ను పక్కనపెట్టేవారు

Published Sun, May 26 2024 10:44 AM

Richa Chadha Recalls Losing Role To Star Kid Despite Multiple Auditions

'హీరామండి: ద డైమండ్‌ బజార్‌' వెబ్‌ సిరీస్‌ ఓటీటీలో అదరగొడుతోంది. ఇందులో నటించిన హీరోయిన్లలో రిచా చద్దా ఒకరు. లజ్జో అనే పవర్‌ఫుల్‌ పాత్ర పోషించిన ఆమె స్క్రీన్‌పై చాలా తక్కువ సేపు మాత్రమే కనిపించింది. కానీ రెస్పాన్స్‌ మాత్రం అదిరిపోయింది. తన యాక్టింగ్‌ స్కిల్స్‌ మెచ్చిన జనాలు ఆమెను మాధురీ దీక్షిత్‌తో పోల్చారు.

దీనిపై ఆమె భిన్నంగా స్పందించింది. ఇలాంటి పొగడ్తలు నాకంత మేలు చేస్తాయని అనుకోను. ఎందుకంటే గతంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలు నన్ను వదిలిపెట్టడం లేదు. సినిమా కోసం ఆడిషన్‌కు వెళ్తే నాలుగు రౌండ్లలో సెలక్ట్‌ అయ్యేదాన్ని. చివరకు ఓ సెలబ్రిటీ కూతురినో లేదంటే ఫలానా హీరో ప్రేయసినో ఎంపిక చేసి నన్ను పక్కనపెట్టేవారు అని చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే రిచా చద్దా త్వరలో తల్లి కాబోతోంది. తను గర్భం ధరించిన విషయాన్ని ఫిబ్రవరి 9న వెల్లడించింది. 1+1=3 అంటూ తన భర్త అలీ ఫైజల్‌తో కలిసున్న ఫోటో షేర్‌ చేసి ఈ గుడ్‌న్యూస్‌ చెప్పింది.

 

 చదవండి: హేమకు మద్దతు ప్రకటించిన మంచు విష్ణు

Advertisement
 
Advertisement
 
Advertisement