సౌత్‌కు, బాలీవుడ్‌కు ఉన్న పెద్ద తేడా ఇదే!: రెజీనా | Regina Cassandra Faced Several Challenges While Entering Into Bollywood | Sakshi
Sakshi News home page

Regina Cassandra: నన్ను నేను అమ్ముకోలేదు.. అందుకే బాలీవుడ్‌లో ఆఫర్లు..

Nov 1 2024 4:17 PM | Updated on Nov 1 2024 4:30 PM

Regina Cassandra Faced Several Challenges While Entering Into Bollywood

చిన్న వయసులోనే సినిమాల్లో అడుగుపెట్టి ఇక్కడే సెటిలైపోయింది రెజీనా కసాండ్రా. తెలుగు, తమిళ భాషల్లో టాప్‌ హీరోయిన్‌గా రాణించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్‌పై ఫోకస్‌ చేసింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో హిందీ చిత్రపరిశ్రమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దక్షిణాది నుంచి వచ్చే నటీమణులు ఎందరో భాష విషయంలో ఇబ్బందిపడుతూ ఉంటారు. వారిలో నా ఫ్రెండ్స్‌ కూడా ఉన్నారు. మనకు భాష రాదంటే సినిమాలో సెలక్ట్‌ చేయడానికి బాలీవుడ్‌ ఇష్టపడదు. కానీ సౌత్‌లో ఇలా ఉండదు. భాష రాకపోయినా సినిమాకు ఎంపిక చేసుకుంటారు.

కాస్టింగ్‌ ఏజెంట్లు ఉండరు
పైగా బాలీవుడ్‌లో పని చేయాలనుకున్న కొత్తలో నేను ముంబైలోనే ఉండాలన్నారు. మీటింగ్స్‌కు హాజరవుతూ ఉండాలన్నారు. సౌత్‌లో ఇలాంటి నియమనిబంధనలేమీ ఉండవు. కాస్టింగ్‌ ఏజెంట్లు అన్న పదానికి కూడా చోటు లేదు. కేవలం మేనేజర్లు, పీఆర్వోలు ఉంటారు. ఇప్పుడిప్పుడే టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీలు సౌత్‌లోనూ ప్రవేశిస్తున్నాయి.

అందుకే నా కోసం ఓ టీమ్‌
ఇకపోతే బాలీవుడ్‌లో ఎక్కువ కాంపిటీషన్‌ ఉంది. అలాగని నాకు త్వరగా ఆఫర్లు రావాలని మార్కెట్లో నన్ను నేను అమ్ముకోలేదు. కానీ ఇలా మొండిగా ఉంటే ఛాన్సులు రావని ఆలస్యంగా తెలుసుకున్నాను. అందుకే నాకంటూ ఓ టీమ్‌ ఏర్పాటు చేసుకున్నాను. వాళ్లే నాకోసం సంబంధిత వ్యక్తులతో బేరసారాలు, సంప్రదింపులు జరుపుతూ ఉంటారు అని రెజీనా చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement