Samantha: సామ్‌.. పాత జ్ఙాపకాలను వీడలేకపోతుందా?  ఆ ఇంట్లోనే ఎందుకు?

Reason Behind Why Samantha Pays Higher Price To Buy House - Sakshi

నాగ చైతన్య, సమంత ఎందుకు విడిపోయారో తెలియదు కాని వీరిద్దరు వీడిపోయినప్పటికీ నుంచి ఫ్యాన్స్ మధ్య వార్ మాత్రం బాగా జరుగుతోంది. ఒకప్పుడు నాగ చైతన్య, సమంత మ్యూచువల్ ఫ్యాన్స్ కాస్త వారిద్దరు విడిపోవడంతో చెరో వైపు తీసుకున్నారు. దీంతో చైను సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్, సమంత ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ ట్వీట్స్ పోస్టుల యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ పోస్టులు చూసిన సమంత చాలా సార్లు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

అందులో తాను 250 కోట్ల భరణం తీసుకున్నట్లు వచ్చిన రూమర్ చూసి బాధపడినట్లు కాఫి విత్ కరణ్ షోలో తెలిపింది సామ్. ప్రస్తుతానికి తమ మధ్య స్నేహ సంబంధాలు లేవని  ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చెప్పలేం అని తెలిపింది.

a

సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో వేరొకరు ఉంటే.. పెళ్లి జ్ఞాపకాలకు దూరంగా ఉండాలనుకుంటారు. కానీ సామ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. నాగ చైతన్యతో కలసి నివసించిన ఇంటినే మళ్లీ కొనుగోలు చేసింది.

పెళ్లికి ముందే సీనియర్ నటుడు మురళి మోహన్ కు చెందిన అపార్ట్ మెంట్‌ లో ఓ ఇంటిని కొనుగోలు చేశాడు నాగచైతన్య. పెళ్లైన వెంటనే సమంతతో కలసి ఆ ఇంట్లోనే ఉన్నాడు చై. విడాకుల తర్వాత మాత్రం ఆ ఇంటిని మరకొరికి అమ్మేశారు. అయితే ఇటీవలే సమంత ఆ ఇంటిని తిరిగి కొనుగోలు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అందుకోసం ఫ్లాట్ ఓనర్ కు అధిక మొత్తం చెల్లించి మరీ కొనుగులో చేసిందట సమంత. 

నాగ చైతన్యతో విడిపోయన తర్వాత హైదరాబాద్‌లో ఇంటి కోసం చాలా ప్రాంతాల్లో వెతికిందట సామ్. కాని ఆమెకు నచ్చిన విధంగా ఇల్లు దొరకలేదట. దాంతో ఎక్కువ మొత్తం చెల్లించి మరీ పాత ఇంటినే మళ్లీ కొనుగోలు చేసింది.  ప్రస్తుతం సమంత, వాళ్ల అమ్మగారితో కలసి ఆ ఇంట్లోనే ఉంటున్నారట.  అయితే కొంతమంది మాత్రం పాత జ్ఞాపకాలను మరవలేకనే సామ్‌ ఆ ఇంటిని కొనుగోలు చేసిందని అంటున్నారు. 

డేరింగ్ డెసిషన్స్ కు  మారుపేరుగా మారింది సమంత. ఒక్కసారి చై చెయ్యి వదిలేసిన తర్వాత ఇండిపెండెంట్ గా నిర్ణయాలు తీసుకుంటోంది. తన లైఫ్ లో ఎన్నడూ లేనంత స్ట్రాంగ్ గా ఉంది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఇప్పటికీ ఆమె గత జ్ఞాపకాలను వీడలేకపోతుందా అంటే.. ఎక్కువ డబ్బు ఇచ్చి పాత ఇంటినే కొనుగోలు చేయడం బట్టి చూస్తే మాత్రం అదే నిజమనిపిస్తుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top