ఏడుస్తూ కూర్చోవాలా? లాగి ఒక్కటివ్వాలా?: రష్మిక | Rashmika Mandanna Suffering With Painful Periods, Insta Post Goes Viral - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: నొప్పిని భరిస్తున్న బ్యూటీ.. ఇలా ఏడుస్తూ ఉండాలా? లేదా..

Mar 10 2024 9:17 PM | Updated on Mar 11 2024 10:10 AM

Rashmika Mandanna Suffering with Painful Periods - Sakshi

అనుభవించేవారికే తెలుస్తుంది.. రష్మిక తన కష్టాలను సోషల్‌ మీడియాలో పంచుకుంది. నొప్పి, బాధ ఎక్కువైందని.. ఇప్పుడేం చేస్తే బెటర్‌గా ఉంటుందంటూ

నెలసరి బాధలు.. అనుభవించేవారికే తెలుస్తుంది. పీరియడ్స్‌ మొదలయ్యే ముందు నుంచి రెండు రోజుల వరకు పొత్తికడుపులో నొప్పి ఉంటుంది. కొన్నిసార్లు ఏ పనీ చేయడానికి వీలుపడనంత నొప్పి ఉంటుంది. ఎంతోమంది మహిళలు ఈ రుతుస్రావం వల్ల వచ్చే బాధలను పంటికిందే భరిస్తారు. హీరోయిన్లు కూడా వాటిని భరిస్తూ సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటారు. అలా సాయిపల్లవి కూడా పీరియడ్‌ టైంలోనే రౌడీ బేబి వంటి పవర్‌ఫుల్‌ డ్యాన్స్‌ నంబర్లు పూర్తి చేసిందట.

ప్రస్తుతం నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న నెలసరితో బాధపడుతోంది. అయితే ఇప్పుడు ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. తన పీరియడ్‌ కష్టాలను సోషల్‌ మీడియాలో పంచుకుంది. నొప్పి, బాధ ఎక్కువైందని.. ఇప్పుడేం చేస్తే బెటర్‌గా ఉంటుందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులను అడిగేసింది. 1. ఐస్‌క్రీమ్స్‌, చాక్లెట్స్‌ తినాలా? 2. ఎవరినైనా లాగి ఒక్కటివ్వాలా? 3. మైండ్‌ను డైవర్ట్‌ చేసేందుకు ఏదైనా సినిమా చూడాలా? 4. అలాగే ఏడుస్తూ కూర్చోవాలా? అని అడిగింది. ఏం చేసినా అది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని పలువురూ అభిప్రాయపడుతున్నారు.

చదవండి: హృదయాలను మెలిపెట్టే సినిమా.. సడన్‌గా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్‌ అక్కడే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement