
నేషనల్ క్రష్ అని రష్మికా మందన్నాను అభిమానులు ఎంతో అభిమానంగా పిలుచుకుంటారు. ఈ బ్యూటీ ఇన్‌స్టా స్టోరీస్, ఇన్‌స్టాపోస్ట్‌లు ఫాలో అయ్యేవారికి మరో రెండు రోజుల పాటు ఈపోస్ట్‌లలో ఎక్కువగా చంద్రుడే కనిపిస్తాడు. లేకపోతే... రాత్రివేళ వెలుగులు జిమ్మే కెమేరా లైట్స్ లేదా కనిపించని నక్షత్రాలు మాత్రమే ఉంటాయి. ఈ విషయాన్ని రష్మికా మందన్నాయే చెప్పారు.
ఇంతకీ విషయం ఏంటంటే... ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా లీడ్ రోల్స్‌లో హిందీలో ‘థామా’ అనే హారర్ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాకు ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నైట్ షూట్ జరుగుతోంది. మరో రెండు రోజుల పాటు ఈ నైట్ షూట్ కొనసాగుతోంది.
అందుకే తన ఇన్‌స్టా స్టోరీస్,పోస్ట్‌లలో ‘చందమామ లేదా కెమేరా లైట్స్ లేదా కనిపించని నక్షత్రాలు మాత్రమే’(ప్రస్తుతం మేం ఉన్న సిటీలో ఇవి కనిపించడం అసాధ్యం) తన ఇన్‌స్టాలో షేర్ చేస్తానన్నట్లుగా రష్మికపోస్ట్ చేశారు. కాగా ఈ సినిమాలో ఆమె పాత్ర వినూత్నంగా ఉంటుందని, యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉంటాయని టాక్. ఇక ఈ చిత్రం ఈ ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ కానుంది.