పెళ్లి ఫొటోలు ఎక్కడ? విడాకులు నిజమేనా? | Actor Sharwanand Deletes His Wedding Photos | Sakshi
Sakshi News home page

Sharwanand: విడాకులు రూమర్స్.. మరోసారి తెరపైకి

Apr 3 2026 5:08 PM | Updated on Apr 3 2026 5:15 PM

Actor Sharwanand Deletes His Wedding Photos

ఈ ఏడాది సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో సక్సెస్ అందుకున్న శర్వానంద్.. ఇప్పుడు 'బైకర్' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. దీనికి కూడా మిశ్రమ స్పందన వినిపిస్తోంది. వీకెండ్ దాటితే అసలు రిజల్ట్ ఏంటనేది తెలుస్తుంది. సరే ఈ విషయాలు పక్కనబెడితే ఈ హీరో విడాకుల రూమర్స్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. అందుకు ఓ కారణం కూడా ఉంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు మిస్టిక్ థ్రిల్లర్.. డైరెక్ట్ స్ట్రీమింగ్)

సహాయ నటుడిగా కెరీర్ మొదలుపెట్టి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్.. 2022లో 'ఒకే ఒక జీవితం' సినిమాతో హిట్ కొట్టాడు. తర్వాత ఏడాది జూన్‌లో రక్షితా రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. జైపూర్‌లో ఈ వేడుక జరగ్గా టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ దంపతులు, సిద్ధార్థ్-అదితీ తదితరులు హాజరయ్యారు. వివాహం జరిగిన ఏడాదికే శర్వా-రక్షితకు కూతురు పుట్టింది. ఈ చిన్నారికి లీలా దేవి మైనేని అనే పేరు పెట్టారు. ఓ ఫొటోని కూడా శర్వా తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.

అయితే గతేడాది సెప్టెంబరులో శర్వానంద్ విడాకులు గురించి కొన్ని పుకార్లు వచ్చాయి. ప్రస్తుతం శర్వా, అతడి భార్య రక్షిత విడివిడిగా ఉంటున్నారనే విషయం బయటకొచ్చింది. కూతురు కొన్నిరోజులు తండ్రి దగ్గర, మరికొన్ని రోజులు తల్లి దగ్గర ఉంటోందని టాక్ కూడా వినిపించింది. అలాంటిదేం లేదని శర్వా టీమ్ అప్పుడు క్లారిటీ ఇచ్చింది. దీంతో అంతా సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు శర్వా.. సోషల్ మీడియాలో తన పెళ్లి ఫొటోలు, ఫ్యామిలీ ఫొటోలని డిలీట్ చేసేశాడు. దీంతో గతంలో వినిపించిన రూమర్స్ నిజమేనా అని ఇప్పుడు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

శర్వా ఇన్ స్టాలో ప్రస్తుతం సినిమాల పోస్టర్స్, వ్యక్తిగత ఫొటోలు తప్పితే భార్య ఫొటో గానీ కూతురు ఫొటో, కుటుంబం ఫొటోలు ఎక్కడా లేకపోవడంతోనే విడాకుల విషయం మరోసారి తెరపైకి వచ్చింది.

(ఇదీ చదవండి: అప్పుడు దెయ్యంగా.. ఇప్పుడు రొమాంటిక్ సినిమాలో)

Advertisement
 
Advertisement
Advertisement