'రామాయణ' కోసం రెహమాన్‌కి అన్ని కోట్ల పారితోషికమా? | Ar Rahman Remuneration For Ramayan Movie | Sakshi
Sakshi News home page

Ramayan Ar Rahman: దేశంలోనే ఎక్కువ రెమ్యునరేషన్.. ఇదో రికార్డ్!

Apr 3 2026 7:53 PM | Updated on Apr 4 2026 8:53 AM

Ar Rahman Remuneration For Ramayan Movie

భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'రామాయణ' నుంచి రాముడు పాత్రకు సంబంధించిన గ్లింప్స్ వచ్చింది. రాముడిగా రణ్‌బీర్ కపూర్ ఆహార్యం బాగానే ఉన్నప్పటికీ ఏదో వెలితిలానే అనిపించింది. గ్రాఫిక్స్ మరీ తీసికట్టులా లేనప్పటికీ రూ.4000 కోట్ల బడ్జెట్ ఔట్‌పుట్ ఇదేనా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. సరే సినిమా రిలీజయ్యే టైంకి క్వాలిటీలో మార్పు ఉండొచ్చు. ఈ విషయం కాసేపు పక్కనబెడితే మరో ఆసక్తికరమైన ముచ్చట సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన శర్వానంద్.. విడాకులు నిజమేనా?)

'రామాయణ' కోసం ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యాన్స్ జిమ్మర్ కలిసి పనిచేశారు. రీసెంట్‌గా రిలీజైన గ్లింప్స్ వీడియోలో రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. అయితే ఈ చిత్రానికి పనిచేసినందుకుగానూ రెహమాన్ రికార్డ్ స్థాయిలో పారితోషికం అందుకున్నాడట. ఇప్పటివరకు ఏ సంగీత దర్శకుడికి ఇవ్వనంత మొత్తం, ఏకంగా రూ.30 కోట్లని తీసుకున్నాడట. దీనితో పాటు రిలీజ్ తర్వాత వచ్చే కలెక్షన్స్ లాభాల్లోనూ వాటా కూడా రానుందట.

'రామాయణ్' గ్లింప్స్ గురించి ఓ వైపు చర్చ జరుగుతుంటే.. మరోవైపు రెహమాన్ పారితోషికం కూడా సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నితీశ్ తివారి దర్శకుడు. ఈ ఏడాది దీపావళికి తొలి పార్ట్ రిలీజ్ కానుంది. రణ్‌బీర్ కపూర్ రాముడు కాగా.. సీతగా సాయిపల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యష్ నటిస్తున్నారు. ఇప్పటికే రామాయణాన్ని భారతీయ ప్రేక్షకులు చాలా సినిమాల్లో చూశారు. మరి ఇది ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్.. ప్రేమజంటని వెంటాడే మొసలి)

(ఇదీ చదవండి: రూ.4,000 కోట్ల బడ్జెట్‌.. ఇదెలా మర్చిపోయారు? వీడియో వైరల్‌)

Advertisement
 
Advertisement
Advertisement