The Rapist: బూస‌న్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న అప‌ర్ణ సేన్ ‘ది రేపిస్ట్‌’

The Rapist wins Award at Busan International Film Festival - Sakshi

జాతీయ అవార్డు గ్రహీత అప‌ర్ణ‌సేన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ‘ది రేపిస్ట్‌’ 26వ బూసన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి ఎంపికైన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 7న ‘ఏ విండో ఆఫ్‌ ఏషియన్‌ సినిమా’ విభాగంలో ప్రదర్శించగా.. ప్రతిష్టాత్మక కిమ్‌ జిసెక్‌ పురస్కారానికి ఎంపికైంది. పలు విదేశీ చిత్రాలతో పోటీ పడిన‌ ఈ మూవీ ఆసియాలోనే అతి పెద్ద ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డు దక్కించుకోవడం గ‌మ‌నార్హం.

కొంకొణాసేన్‌ శర్మ, అర్జున్‌ రాంపాల్‌, తన్మయ్‌ దనానియా ముఖ్య‌ పాత్రలు పోషించారు. అనుకోకుండా జరిగిన ఓ భయంకరమైన సంఘటన ఈ ముగ్గురి జీవితాలపై ఎటువంటి ప్రభావం చూపిందనేది ఈ సినిమా కథాంశం. ఈ చిత్రంలో కొంకణా అత్యాచారానికి గురైన మ‌హిళ‌ పాత్రను పోషిస్తుంది. అర్జున్ రాంపాల్ ఆమె భర్త పాత్రలో నటిస్తున్నారు. అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ది క్వెస్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఇంతకుముందు సైతం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన‌ ‘స్కామ్ 1992’ వెబ్‌సిరీస్‌ని నిర్మించింది.

చ‌ద‌వండి: బూసన్‌ ఫీల్మ్‌ ఫెస్టివల్‌కి అపర్ణసేన్‌ ‘ది రేపిస్ట్‌’

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top