Green India Challenge: Rana Accepts Prabhas and Sruti Hassan's Challenge and Nominates Fans | ఫ్యాన్స్‌ను నామినేట్‌ చేసిన రానా - Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ సవాల్‌ను స్వీకరించిన రానా

Aug 20 2020 2:50 PM | Updated on Aug 20 2020 4:09 PM

Rana Daggubati Accepted Prabhas And Shruti Hassan Green India Challenge - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో కొనసాగుతోంది. ఈ‌ కార్యక్రమంలో భాగంగా హీరోహీరోయిన్‌లు మొక్కలు నాటడమే కాకుండా సహానటులను నామినెట్‌ చేస్తున్నారు. ప్రభాస్‌, హీరోయిన్‌ శృతిహాసన్‌లు ఇచ్చిన చాలెంజ్‌ను రానా దగ్గుబాటి స్వీకరించాడు. ఇవాళ(గురువారం) హైదరాబాద్‌లో రెండు మొక్కలు నాటిన ఫొటోలను ట్విటర్‌ షేర్‌ చేస్తూ ఆలస్యంగా చాలెంజ్‌ స్వీకరించినందుకు క్షమాపణలు కోరడమే కాకుండా.. తనను ఫాలో అయ్యే ప్రతిఒక్కరిని గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌కు నామినేట్‌ చేశాడు. ‘కాస్తా ఆలస్యమైనందుకు క్షమించండి. రెండు మొక్కలు నాటాను. ఒకటి ఆదిపురుష్‌ ప్రభాస్‌, మరోకటి రాక్‌స్టార్‌ శృతిహాసన్‌. అలాగే గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌కు నన్ను ఫాలో అవుత్ను ప్రతి ఒక్కరిని నామినేట్‌ చేస్తున్నా. ఇది గ్రీన్‌ ఇండియా కోసమే’ అంటూ ట్వీట్‌ చేశాడు.
(చదవండి: ‘మహేష్‌ బాబు ఇది మీ కోసమే’)

ఇటీవల సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తన పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటి తమిళ హీరో విజయ్‌ తళపతిని గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌కు నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే. అలాగే మెగాస్టార్‌ చిరంజీవి, అక్కినేని నాగార్జున, సమంతా, రాశికన్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలసిందే. అయితే ఇటీవల రానా వివాహం తన గర్ల్‌ఫ్రెండ్‌ మిహీక బజాజ్‌తో‌ రామనాయుడు స్టూడియోలో ఆగష్టు 8న కుటుంబ సభ్యుల మధ్య  జరిగిని విషయం తెలిసిందే. దీంతో రానా-మిహీకలకు సినీ ప్రముఖులంతా సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: అన్ని జీవజాతుల్ని సమానంగా చూడాలి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement