
రామ్ హీరోగా పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పీరియాడికల్ లవ్‌స్టోరీ మూవీలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రంలో సాగర్‌పాత్రలో రామ్, మహాలక్ష్మిపాత్రలో భాగ్యశ్రీ బోర్సే కనిపిస్తారు.
మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. కాగా...ఈ నెల 15న (గురువారం) రామ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించను న్నట్లుగా మేకర్స్ గురువారం వెల్లడించారు. సో.. బర్త్ డేకి ఈ సినిమా టైటిల్‌ను ఫ్యాన్స్ కు గిఫ్ట్‌గా ఇస్తున్నట్లున్నారు హీరో రామ్. ఈ సినిమాకు సంగీతం: వివేక్ – మెర్విన్, కెమెరా: సిద్ధార్థ్ నూని.