
సినీ ఇండస్ట్రీలో సంచలన డైరెక్టర్ అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఆయనే. టాలీవుడ్‌లో తనదైన మార్క్ చూపించారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ ఆర్జీవీ. నాగార్జునతో కలిసి తెలుగు ప్రేక్షకులకు బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన శివ చిత్రం అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో జేడీ చక్రవర్తి విలన్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో అమలా హీరోయిన్‌గా నటించింది.
అయితే ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. శివ మూవీని త్వరలోనే రీ రిలీజ్ చేయనున్నట్లు ట్విటర్‌లో(ఎక్స్) పోస్ట్ చేశారు. నాగార్జున స్టైల్లో సైకిల్ చైన్ తెంచుతున్న వీడియోను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. టాలీవుడ్‌కు ఆర్జీవీ సూపర్ హిట్ చిత్రాలు అందించారు.
Rgv in and as SHIVA ..Re releasing VERY SOON pic.twitter.com/F8Pg9zzGQb
— Ram Gopal Varma (@RGVzoomin) May 29, 2024