ఉపేంద్ర కబ్జా

Ram Gopal Varma to release the theme poster of Kabza - Sakshi

ఉపేంద్ర పుట్టినరోజు (సెప్టెంబర్‌ 18) సందర్భంగా ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కబ్జా’ థీమ్‌ పోస్టర్‌ను దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ చేతుల మీదుగా విడుదల చేయించారు. శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని లాంకో శ్రీధర్‌ సమర్పిస్తున్నారు. ‘ఏ’, ‘ఉపేంద్ర’ తదితర చిత్రాలతో హీరోగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఉపేంద్ర. ప్రస్తుతం ఆయన హీరోగా ‘కబ్జా’ ప్యాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, ఒరియా, మరాఠీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగులో సుధీర్‌బాబు హీరోగా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమాకి దర్శకత్వం వహించిన ఆర్‌.చంద్రు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top