
Do You Know Ram Charan Hair Stylist Remuneration: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రతి సినిమాలో డిఫరెంట్ లుక్స్‌తో అలరిస్తారు. స్టార్ హీరో నుంచి పాన్ ఇండియా స్టార్‌గా మారిన రామ్‌చరణ్ శంకర్ దర్శకత్వంలో RC15 చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌చరణ్ చాలా స్టయిలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ముంబై నుంచి ఓ ప్రత్యేక టీంను నియమించుకున్నారట.
రామ్‌చరణ్ హెయిర్ స్టైలిస్ట్‌కు మాత్రమే ప్రొడక్షన్ టీమ్ ఒక్క రోజుకి రూ.1.5-2 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారట. ఈ స్టైలిస్ట్‌కు తోడుగా మరో ముగ్గురు అసిస్టెంట్లు కూడా ఉన్నారు. షూటింగ్ ఉన్న ప్రతిసారి వీరికి బిజినెస్ క్లాస్ ఫ్లయిట్ టికెట్‌తో పాటు స్టార్ హోటల్‌ను బుక్ చేస్తారట. అలా షూటింగ్ పూర్తయ్యేసరికి దాదాపు కోటి రూపాయల వరకు అవుతుందట. పాన్ ఇండియా సినిమా అంటే ఈ మాత్రం ఉండాల్సిందేగా మరి. ప్రస్తుతం రామ్‌చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది.