Jr NTR And Ramcharan Groove To Dosti Song From RRR- Sakshi
Sakshi News home page

‘దోస్తీ’ సాంగ్‌‌‌‌: ఎంజాయ్ చేస్తున్న రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌

Aug 11 2021 1:45 PM | Updated on Aug 11 2021 3:12 PM

Ram Charan And Jr NTR Groove to Dosti song From RRR - Sakshi

రెండేళ్లుగా అభిమానులను ఊరిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ఎట్టకేలకు ఈ అక్టోబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇప్పటికే రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది.దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు.ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రీకరణ చివరి దశకు చేరింది. షూటింగ్‌ పనులు చకచకా జరుగుతున్నాయి. ఉక్రెయిన్‌లో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది.

రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుంటంతో చిత్రయూనిట్‌ ప్రమోషన్లలో భాగంగా ఆర్ఆర్‌ఆర్‌ నుంచి దోస్తీ పాట విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దోస్తీ సాంగ్‌ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగష్టు 1న విడుదలైన ఈ పాట ప్రతి ఒక్కరిని ఎంతో ఆకట్టుకుంటోంది.  కీరవాణి సంగీతంలో అయిదు భాషలకు చెందిన అయిదుగురు సంగీత యువ గాయకులు ఈ పాటను హుషారెత్తించేలా ఆలపించారు.. ‘ఆర్‌ఆర్‌ఆర్’లో రామ్‌చరణ్‌-తారక్‌ల స్నేహానికి ప్రతీకగా ఈ పాటను రూపొందించినట్లు అర్థమవుతోంది.

ఈ క్రమంలో తాజాగా మరో వీడియోతో అభిమానులకు సర్‌‌‌‌‌‌ప్రైజ్ ఇచ్చింది ఆర్ఆర్ఆర్ టీమ్. ఈ వీడియోలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లగ్జరీ కారులో ఉక్రెయిన్‌లో షూటింగ్‌ ప్రదేశానికి ప్రయాణిస్తున్నారు. అలా వెళ్తూ కారులో దోస్తీ సాంగ్‌‌‌‌ను వింటూ ఇద్దరూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. పాట ప్లే అవుతుంటూ ఎన్టీఆర్‌ తన గొంతును కూడా కలిపాడు. ఇక ఈ వీడియో అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్లు, పోస్టుర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement