యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌.. ‘రాజమండ్రి రోజ్‌మిల్క్‌’ టీజర్‌ చూశారా?

Rajamundry Rose Milk Official Teaser Out Now - Sakshi

జై జాస్తి, అవంతిక జంటగా నాని బండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాజమండ్రి రోజ్‌మిల్క్‌’. సురేష్‌ ప్రొడక్షన్స్‌, ఇంట్రూప్‌ పతాకంపై డి. సురేష్‌ బాబు, ప్రదీప్‌ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా నాని బండ్రెడ్డి మాట్లాడుతూ–‘‘ఫ్రెష్‌ కంటెంట్‌తో వస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది.

కాలేజీ రోజుల్లోని మరపురాని సంఘటనలు, మధురమైన అనుభూతులను ఈ చిత్రం గుర్తు చేస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ఓ మంచి మూవీ చూశామనే అనుభూతి కలుగుతుంది’’ అన్నారు. ‘వెన్నెల’ కిషోర్, ప్రవీణ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోవింద్‌ వసంత్, అజయ్‌ అరసాడ, యశ్వంత్‌ నాగ్, భరత్‌–సౌరభ్, కెమెరా: శక్తి అరవింద్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top