నవరసాల రాఘవ రెడ్డి  | Sakshi
Sakshi News home page

నవరసాల రాఘవ రెడ్డి 

Published Fri, Dec 22 2023 1:55 AM

Raghava Reddy Movie Trailer Launch - Sakshi

శివ కంఠమనేని హీరోగా, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాఘవ రెడ్డి’. సంజీవ్‌ మేగోటి దర్శకత్వం వహించారు. స్పేస్‌ విజన్‌ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్‌ హౌస్‌ సినీ మ్యూజిక్‌ బ్యానర్‌పై కేఎస్‌ శంకర్‌ రావ్, జి. రాంబాబు యాదవ్, ఆర్‌. వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా జనవరి 4న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు, నిర్మాత మురళీ మోహన్‌ విడుదల చేశారు. సంజీవ్‌ మేగోటి మాట్లాడుతూ– ‘‘యాక్షన్, డ్రామా, థ్రిల్లర్‌ అంశాలతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించాం’’ అన్నారు.

‘‘మధురపూడి గ్రామం అనే నేను’ చిత్రంలో నా పాత్ర రగ్డ్‌గా ఉంటుంది. ‘రాఘవ రెడ్డి’లో సిన్సియర్, స్ట్రిక్ట్‌ ప్రోఫెసర్‌గా నటించాను. చక్కటి విందు భోజనంలా నవరసాలున్న సినిమా ఇది’’ అన్నారు శివ కంఠమనేని. ‘‘మా బ్యానర్‌ నుంచి వస్తోన్న మూడో సినిమా ఇది. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు వెంకటేశ్వరరావు. ఈ ట్రైలర్‌ విడుదల వేడుకలో నటి అన్నపూర్ణ, దర్శకుడు నీలకంఠ, సంగీతదర్శకుడు సుధాకర్‌ మారియో, ఎడిటర్‌ ఆవుల వెంకటేశ్, వరా ముళ్లపూడి, నటుడు అజయ్‌ ఘోష్‌ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: సంజీవ్‌ మేగోటి– సుధాకర్‌ మారియో, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్‌: ఘంటా శ్రీనివాసరావు. 
 

 
Advertisement
 
Advertisement