లారెన్స్‌ మనసు బంగారం.. దివ్యాంగురాలి కోసం.. | Raghava Lawrence Want To Build House To Disabled Person Swetha, Watch Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Raghava Lawrence: దివ్యాంగురాలికి స్కూటీ కొనిచ్చిన లారెన్స్‌.. ఇప్పుడేకంగా!

Sep 7 2025 3:25 PM | Updated on Sep 7 2025 5:28 PM

Raghava Lawrence Want to Build a House to Disabled Person Swetha

స్టార్‌ హీరో రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence) మంచి చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఎవరి పరిస్థితైనా బాగోలేదని తెలిస్తే క్షణం ఆలోచించకుండా సాయం చేస్తుంటాడు. ఈమధ్యే కూతురి చదువు కోసం చనిపోయిన భార్య మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టిన ఓ తండ్రి కథ విని చలించిపోయాడు. భార్య జ్ఞాపకంగా మిగిలున్న మంగళసూత్రాన్ని విడిపించి ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటానని మాటిచ్చాడు.

అప్పుడు స్కూటీ గిఫ్ట్‌
తాజాగా పూరి గుడిసెలో జీవిస్తున్న ఓ దివ్యాంగురాలు శ్వేత కుటుంబానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. నిజానికి ఆ దివ్యాంగురాలు నడవలేని స్థితిలో ఉంటే ఆమె కాలికి సపోర్ట్‌గా ఉండే పరికరాన్ని కొనిచ్చి ఆమె నడిచేలా చేశాడు. ఎక్కడికంటే అక్కడికి వెళ్లేందుకు వీలుగా స్కూటీ బహుమతిగా ఇచ్చాడు. అయినా ఇంకా ఏదో వెలితిగా అనిపించింది. ఆమెను పూరి గుడిసె నుంచి మంచి ఇంటికి మార్చాలని బలంగా నిర్ణయించుకున్నాడు. 

ఇంటి బాధ్యత
మంచి ఇంటికి మారితేనే తన జీవితం కూడా బాగుంటుందని భావించాడు. ఇంటి నిర్మాణం కోసం అడ్వాన్స్‌ కూడా ఇచ్చాడు. ఈ మేరకు ఓ వీడియో షేర్‌ చేశాడు. ఇది చూసిన అభిమానులు.. లారెన్స్‌ మంచి మనసును మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. లారెన్స్‌ ప్రస్తుతం బుల్లెట్టు బండి సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కాంచన 4 స్టార్ట్‌ చేయనున్నాడు.

 

 

చదవండి: Bigg Boss 9 : ఊహకందని మార్పులు.. ప్రోమోతోనే ట్విస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement