Puri Jagannadh: ‘లైగర్‌లో ముందుగా ఆమెను హీరోయిన్‌గా అనుకున్నా’

Puri Jagannadh Said Janhvi Kapoor is First Choice For Liger, Not Ananya Panday - Sakshi

డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ-అనన్య పాండే జంటగా నటించిన తాజా చిత్రం లైగర్‌. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో లైగర్‌ టీం ప్రమోషన్‌ కార్యక్రమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న పూరి జగన్నాథ్‌ చిత్ర విశేషాలను పంచుకున్నాడు. అయితే లైగర్‌లో ముందుగా తాను వేరు హీరోయిన్‌ను అనుకున్నట్లు చెప్పాడు.

చదవండి: ప్రపోజల్స్‌పై ‘జీ సరిగమప’ విన్నర్‌ శ్రుతిక ఆసక్తిర వ్యాఖ్యలు

ఈ మేరకు పూరీ మాట్లాడుతూ.. ‘విజయ్‌ దేవరకొండతో లైగర్‌ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాక నిర్మాణంలో భాగంగా నిర్మాత కరణ్‌ జోహార్‌ని కలిసి కథ చెప్పాను. ఆయన వెంటనే ఒకే అన్నారు. ఆ తర్వాత హీరోయిన్‌ కోసం జాన్వీ కపూర్‌ను కలిశా. ఎందుకంటే కథ అనుకున్నప్పుడే విజయ్‌కి జోడిగా జాన్వీని అనుకున్నాను. నేను శ్రీదేవి విరాభిమాని కావడంతో నా చిత్రం ద్వారానే జాన్వీని తెలుగులో లాంచ్‌ చేయాలనుకున్నా. అందుకే జాన్వీని కలిసి కథ వినిపించా. డేట్స్‌ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్‌ను వదులుకుంది.

చదవండి: నా పాత్రను అందరు ప్రశంసిస్తున్నారు: ‘సీతారామం’ నటుడు

ఇదే విషయాన్ని కరణ్‌కు చెప్పడంతో​ ఆయన అనన్య పేరును సూచించారు. దీంతో అనన్యను హీరోయిన్‌గా ఫైనల్‌ చేశాం. ఇక షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యాక తెలిసింది ఆమె ఎంత మంచి నటి అనేది. ప్రతి సీన్‌లోనూ హావభావాలు చాలా బాగా ఇచ్చేది. ఈ సినిమా తర్వాత ఆమెకు యూత్‌లో ఫాలోయింగ్‌ బాగా పెరుగుతుంది’ అని పూరీ చెప్పుకొచ్చాడు. కాగా పూరీ కనెక్ట్స్‌-ధర్మ ప్రొడక్షన్స్‌లో కరణ్‌ జోహార్‌-చార్మీ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. కాగా రీసెంట్‌గా సెన్సార్‌ కార్యక్రమాన్ని జరపుకున్న ఈ మూవీకి బోర్డు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో 7 అసభ్యకర సన్నివేశాలని ఉన్నాయని, వాటి తొలగించి చిత్రం విడుదల చేయాలని పేర్కొంటూ సెన్సార్‌ బోర్డు లైగర్‌కు యూ/ఏ సర్టిఫికేట్‌ జారీ చేసింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top