Se Re Ga Ma Pa Winner Shruthika Funny Comments On Proposal Messages - Sakshi
Sakshi News home page

Shruthika: ప్రపోజల్‌ మెసేజస్‌పై సరిగమప విన్నర్‌ శ్రుతిక ఆసక్తిర వ్యాఖ్యలు

Published Fri, Aug 19 2022 10:07 AM | Last Updated on Fri, Aug 19 2022 10:46 AM

Se Re Ga Ma Pa Winner Shruthika Funny Comments On Proposal Messages - Sakshi

జీ సరిగమప- ది సింగింగ్‌ సూపర్‌ స్టార్స్‌ షో తన గాత్రంతో ఎంతోమందిని ఆకట్టుకుని విజేతగా నిలిచింది శ్రుతిక సముద్రాల.  ఆరేళ్లకే సంగీతంలో అడుగు పెట్టిన శ్రుతిక సముద్రాల 'జీ సరిగమప- ది సింగింగ్‌ సూపర్‌ స్టార్స్‌' ఫినాలే కార్యక్రమంలో 'ఏమాయె నా కవిత', 'మెరిసేటి పువ్వా', 'సంకురాత్రి కోడి', 'కొంచెం నీరు', 'ఆనతినీయరా' వంటి పాటలతో అదరగొట్టింది. అంతేకాకుండా విన్నర్‌ కాకముందే పలు బహుమతులను కూడా గెలుచుకుంది. ఫినాలేకు 8 మంది ఫైనలిస్ట్‌లు చేరగా, అందులో అత్యత్భుదమైన ప్రదర్శన కనబరిచి టైటిల్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది.

చదవండి: Anasuya Bharadwaj: ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి: అనసూయ సంచలన వ్యాఖ్యలు

జీ సరిగమప షో విజేతగా నిలిచిన శ్రుతిక ఇటీవల సాక్షితో ముచ్చటిందచింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తను చిన్నప్పటి నుంచి దివంగత లెజెండరి గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, సింగర్స్‌ చిత్ర, సుశీల గారిని ఫాలో అయ్యానని, అయితే తన ఫేవరేట్‌ సింగర్స్‌ మాత్రం చిత్రమ్మ, శ్రేయా ఘోషల్‌ అని చెప్పంది. ఇక చిత్రగారు పాడిన పాటల్లో ముంబైలోని ‘కన్నాను లే కళయికలు ఏడాడు ఆగవులే..’ అంటూ అచ్చం చిత్రగారిలా పాడి వినిపించింది. అనంతరం ఇక తనకు వచ్చిన మెసేజ్‌లో ప్రపోజల్స్‌ కూడా వస్తుంటాయి కదా.. అలా మీకు ఏమైన వచ్చాయా? అని యాంకర్‌ అడగ్గా.. శ్రుతిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

చదవండి: ది ఘోస్ట్‌లో నాగార్జున వాడిన ‘తమ హగనే’ అర్థమేంటో తెలుసా?

‘‘ఏంటో కానీ నాకు ఎక్కువగా అక్క అక్క అక్క అనే వస్తున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రపోజల్స్‌ రాలేదు. నేను చూసిన మెసేజ్‌లో అన్ని అక్క అనే ఉన్నాయి. ‘వీ సపోర్ట్‌ యూ అక్క’ అని మెసేజ్‌ పెడుతున్నారు. అవి చూసి నాకు షాకింగ్‌గా అనిపించింది. ఎందుకంటే అందరు నన్న అంత పెద్దదాన్ని అనుకుంటున్నారా? ఏంటి.. అంత పెద్దదానిలా కనిపిస్తున్నానా? అని అనిపిస్తోంది’ అంటూ శ్రుతిక చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె తన గురించి పంచుకున్న మరిన్ని విశేషాలను ఇక్కడ చూడండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement