Producer Dil Raju Interesting Comments on Actors Caravan Culture in Industry - Sakshi
Sakshi News home page

Dil Raju : హీరోల క్యారవాన్‌ కల్చర్‌పై దిల్‌రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Nov 29 2022 10:42 AM | Updated on Nov 29 2022 11:44 AM

Producer Dil Raju Comments About Actors Caravan Culture In Industry - Sakshi

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. స్టార్‌ ప్రొడ్యూసర్‌గా రెండు దశాబ్దాలుగా సక్సెస్‌ఫుల్‌ సినిమాలు తీస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఓవైపు నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్‌గానూ కొనసాగుతున్నారు. ప్రస్తుతం తమిళ స్టార్‌ హీరో విజయ్‌తో వారసుడు అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.

సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సంక్రాంతి పండగ సందర్భంగా డైరెక్ట్‌ తెలుగు సినిమాలకే ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల తెలుగు నిర్మాతల మండలి నిర్ణయించిన నేపథ్యంలో ఈమధ్య కాలంలో దిల్‌రాజు పేరు ఎక్కువగా వినిపిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన షూటింగ్‌, క్యారవాన్‌ కల్చర్‌పై సెన్సేషన్‌ కామెంట్స్‌ చేశారు.

'ఇండస్ట్రీలో క్యారవాన్‌ కల్చర్‌ వచ్చాక టైం వేస్ట్‌ ఎక్కువ అవుతుంది. షాట​ రెడీ అ‍య్యాక హీరో,హీరోయిన్లను పిలవాలంటే ముందు వాళ్ల అసిస్టెంట్లను పిలవాలి. వాళ్లు వెళ్లి యాక్టర్లు వచ్చేసరికి 15నిమిషాలు పడుతుంది, ఆ తర్వాత షూటింగ్‌ ఏరియా క్లియర్‌ చేయడానికి ఇంకాస్త టైం పడుతుంది. ఇలా షూటింగ్‌లో చాలా టైం వేస్ట్‌ అవుతుంది. హీరో, హీరోయిన్లు క్యారవాన్‌ కల్చర్‌ వల్ల డిసిప్లైయిన్‌ కూడా పోయింది' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దిల్‌రాజు చేసిన ఈ కామెంట్స్‌​ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement