Nag Ashwin Reveals Latest Update On Project K Prabhas Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Project K Update: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌ చెప్పిన నాగ్‌ అశ్విన్‌

May 18 2022 8:16 AM | Updated on May 18 2022 12:30 PM

Prabhas,Nag Ashwin Project K Movie Latest Update - Sakshi

ప్రాణం పెట్టి ‘ప్రాజెక్ట్‌ కె’ కోసం పని చేస్తున్నాం

స్టార్‌ హీరోల చిత్రాల్లో పరిచయ సన్నివేశానికి ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇంట్రడక్షన్‌ సీన్స్‌ని ప్లాన్‌ చేస్తుంటారు దర్శకులు. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమాలోని పరిచయ సన్నివేశాన్ని కూడా ఓ రేంజ్‌లో ప్లాన్‌ చేశారట చిత్రదర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ఈ పరిచయ సన్నివేశం చిత్రీకరణను పూర్తి చేశారు. కాగా ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ వేచి చూస్తుండగా, వారికి కిక్‌ ఇచ్చే వార్తను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు నాగ్‌ అశ్విన్‌.

(చదవండి: రాజశేఖర్‌గారి వల్ల ఫేమస్‌ అయ్యా!  – డైరెక్టర్‌ సుకుమార్‌ )

‘‘ఒక షెడ్యూల్‌ అయ్యింది. ప్రభాస్‌గారి ఇంట్రో బిట్‌తో సహా పూర్తి చేశాం. జూన్‌ నెలాఖరు నుంచి మళ్లీ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం. రిలీజ్‌ ఆర్డర్‌లో మనం లాస్ట్‌ కదా (ప్రభాస్‌ చేస్తున్న సలార్, ఆదిపురుష్‌ తర్వాతే ప్రాజెక్ట్‌ కె ఉంటుంది). ఇంకా వరుసగా అప్‌డేట్స్‌ ఇవ్వడానికి టైమ్‌ ఉంది. అయితే అందరూ ప్రాణం పెట్టి ‘ప్రాజెక్ట్‌ కె’ కోసం పని చేస్తున్నాం’’ అని పోస్ట్‌ చేశారు నాగ్‌ అశ్విన్‌. దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రధారులు. ఈ చిత్రాన్ని అశ్వినీదత్‌ నిర్మిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement