నిర్మాతగా మారిన అలీ..గుడ్ విషెస్ తెలిపిన ప్రభాస్

కమెడియన్, నటుడు అలీ నిర్మాతగా మారారు. మలయాళ సూపర్ హిట్ ‘వికృతి’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ‘అందరూ బావుండాలి.. అందులో నేనుండాలి’ అనే టైటిల్‌ను ఖారారు చేశారు. 'అలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్' పతాకంపై అలీ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ఫూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌ను మొదలుపెట్టారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ చిత్రానికి గుడ్ విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ..అలీవుడ్ బ్యానర్ హాలీవుడ్ స్టైల్‌లో ఉందని, అలీ నిర్మాతగా మారి సినిమాలు తీయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇక ఈ చిత్ర ప్రమోషన్‌ను ప్రభాస్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఆలీ తెలిపారు.
ప్రభాస్‌తో కలిసి ‘యోగి’, ‘బుజ్జిగాడు’, ‘ఏక్ నిరంజన్’,‘ బిల్లా’ సహా అనేక సినిమాల్లో నటించానని, తనమీద అభిమానంతో ఇండియాలో లేనప్పటికీ తన సినిమా కోసం వీడియో చేసి పంపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న అలీ ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో అలీ ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాకుండా తనకు చిత్రపరిశ్రమలో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణరెడ్డిలు గెస్ట్ రోల్ పోషించగా, నరేష్, శివబాలాజీ, తనికెళ్ల భరణి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ దగ్గర అసిస్టెంట్‌గా చేసిన రాకేశ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేయనున్నారు.
చదవండి : ఈ వార్త నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
'కథ వేరేలా ఉందే'.. అనిల్ రావిపూడిని కలిసిన సోహైల్