కాలేజీకీ పోలీసాఫీసర్‌ | Prabhas As Police Officer In Spirit Movie | Sakshi
Sakshi News home page

కాలేజీకీ పోలీసాఫీసర్‌

May 28 2026 5:25 AM | Updated on May 28 2026 5:25 AM

Prabhas As Police Officer In Spirit Movie

కాలేజీకి స్టూడెంట్స్‌ వెళ్లడం కామన్‌. అయితే ఒక పోలీసాఫీసర్‌ వెళితే అక్కడ ఏదో సమస్య ఉన్నట్లు లేదా తనవాళ్లని పికప్‌ చేసుకోవడానికో మరేదో కారణమైనా ఉండొచ్చు. మరి... ‘స్పిరిట్‌’లో ఓ పోలీసాఫీసర్‌ కాలేజీకి ఎందుకు వెళ్లాడో తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకూ వేచి చూడాల్సిందే. ప్రభాస్‌ తన కెరీర్‌లో తొలిసారిగా పోలీసాఫీసర్‌ పాత్ర చేస్తున్న చిత్రం ‘స్పిరిట్‌’. 

సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిప్తీ దిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లోని అజీజ్‌ నగర్‌లో జరిగింది. అక్కణ్ణుంచి నగరంలోని ఓ ప్రముఖ ఉమెన్స్‌ కాలేజీకి షిఫ్ట్‌ అవుతోందట యూనిట్‌. ప్రభాస్, త్రిప్తి పాల్గొనగా కాలేజీ పరిసరాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశారని సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేయనున్నట్లు యూనిట్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement