ప్రభాస్ 'కల్కి' సరికొత్త రికార్డులు.. ఆ సినిమాల్ని దాటేసి ఏకంగా! | Prabhas Kalki 2898 AD Movie Records Latest | Sakshi
Sakshi News home page

Prabhas Kalki: ఇదెక్కడి మాస్ రా మావ.. 'కల్కి' హవా మామూలుగా లేదు!

Jun 26 2024 7:29 AM | Updated on Jun 26 2024 8:35 AM

Prabhas Kalki 2898 AD Movie Records Latest

డార్లింగ్ ప్రభాస్ మరికొన్ని గంటల్లో 'కల్కి'తో రాబోతున్నాడు. మూవీ లవర్స్ మధ్య ఇప్పుడంతా దీని గురించే డిస్కషన్ నడుస్తోంది. మరోవైపు టికెట్స్ బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సరిగా ప్రమోషన్ చేయనప్పటికీ మూవీపై హైప్ ఉహించిన దానికంటే బాగానే వచ్చింది. ఈ క్రమంలోనే 'కల్కి'తో ప్రభాస్ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు.

(ఇదీ చదవండి: 'కల్కి' థీమ్ సాంగ్ రిలీజ్.. మొత్తం స్టోరీ ఒకే పాటలో!)

'కల్కి' సినిమాకి మన దగ్గర ఫుల్ క్రేజ్ ఉందని తెలిసిందే. అమెరికాలోనూ ఈ మూవీకి మామూలు డిమాండ్ లేదు. ఎందుకంటే ఇప్పటికే లక్ష 50 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. అలానే 3 మిలియన్ డాలర్ల ప్రీ సేల్స్ జరిగింది. ఒకవేళ హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం అమెరికాలో 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' వసూళ్ల రికార్డులు కొట్టుకుపోవడం గ్యారంటీ.

ఇక మన దగ్గర కూడా టికెట్స్ బాగానే సేల్ అవుతున్నాయి. అలానే తొలిరోజు వసూళ్లలో 'ఆర్ఆర్ఆర్' అందుకున్న రూ.223 కోట్ల వసూళ్లని 'కల్కి' బ్రేక్ చేయడం కచ్చితం అనిపిస్తోంది. ఎందుకంటే షోల దగ్గర నుంచి టికెట్ రేట్ల వరకు అన్ని పెంచారు. ఇలా విడుదలకు ముందే పలు రికార్డుల్ని సాధిస్తున్న 'కల్కి'.. థియేటర్లకి వచ్చిన తర్వాత ఇంకెన్ని ఘనతలు సాధిస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: 'కల్కి' మిడ్ నైట్ షోలు వేయకపోవడానికి కారణం అదేనా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement