'కల్కి' థీమ్ సాంగ్ రిలీజ్.. మొత్తం స్టోరీ ఒకే పాటలో! | Prabhas Kalki 2898 AD: Theme Of Kalki Telugu Song Is Out Now | Sakshi
Sakshi News home page

Kalki Theme Song: ఇంత మంచి పాటని ఇప్పుడు రిలీజ్ చేశారు!

Jun 25 2024 8:02 PM | Updated on Jun 25 2024 9:24 PM

Prabhas Kalki 2898 Theme Song Telugu

ప్రభాస్ 'కల్కి' రిలీజ్‌కి మరో రోజు మాత్రమే మిగిలుంది. ఇప్పటికే ప్రమోషన్స్ అన్నీ పూర్తి చేసేశారని అనుకుంటే.. ఇప్పుడు తాజాగా థీమ్ సాంగ్ రిలీజ్ చేశారు. 'కల్కి' గురించి ఎలివేషన్స్ ఇస్తూ సాగిన అద్భుతంగా ఉంది. పురాణాల గురించి దేవుని అవతారాల గురించి వర్ణిస్తూ సాగిన ఈ పాట థియేటర్లలో దద్దరిల్లిపోయేలా చేయడం గ్యారంటీ అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: సొరచేప వల్ల ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ నటుడు)

ఇకపోతే నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ లాంటి స్టార్స్ నటించారు. వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా, ఎక్కడివక్కడే హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మూవీపై, తొలిరోజు కలెక్షన్స్‌పై అంచనాలు ఓ రేంజులో పెరిగిపోతున్నాయి.

(ఇదీ చదవండి: 'భారతీయుడు 2' ట్రైలర్ రిలీజ్.. మీరు చూశారా?)

Advertisement
 
Advertisement
Advertisement