'పూనమ్ మరణవార్త తెలిసినా ఫీలవ్వలేదు'.. భర్త షాకింగ్ కామెంట్స్! | Poonam Pandey Husband Sam Bombay Praises Her Doing Fake Death Stunt | Sakshi
Sakshi News home page

Poonam Pandey: 'దేశంలోనే అలాంటి మహిళ ఆమెనే'.. పూనమ్ భర్త కామెంట్స్ వైరల్!

Feb 4 2024 7:58 PM | Updated on Feb 5 2024 12:10 PM

Poonam Pandey Husband Sam Bombay Praises her Doing Fake Death Stunt - Sakshi

బాలీవుడ్ భామ, మోడల్ పూనమ్ పాండే ఇచ్చిన షాక్ మామూలుగా లేదు. కొందరైతే ఇంకా ఆ షాక్ నుంచి తెరుకోలేదు కూడా. అయితే ఆమె చేసిన పనికి పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం కోసం ఇలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై ఆమె భర్త సామ్ బాంబే స్పందించారు. ఆమె మరణవార్త విన్నాక నాకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదని అన్నారు. ఇలాంటిది జరిగి ఉండదని నేను భావించానని ఆయన వెల్లడించారు. అంతే కాకుండా తాము చట్టబద్ధంగానే పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. తామిద్దరం ఇంకా విడాకులు తీసుకోలేదని ఓ మీడియాకు ఇ‍చ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

సామ్ బాంబే మాట్లాడుతూ.. 'ఈ వార్త విన్నప్పుడు నా హృదయంలో ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. నాకైతే ఎలాంటి నష్టం అనిపించలేదు. నేను ఇది జరిగి ఉండదని భావించా. ఎందుకంటే ఎవరితోనైనా మీరు కనెక్ట్ అయి ఉంటే ప్రతి విషయంలో ఎక్కువగా ఫీలవుతారు. నేను ప్రతిరోజూ ఆమె గురించి ఆలోచిస్తా. అంతే కాదు ఆమె కోసం ప్రార్థిస్తాను కూడా. ఏదైనా తప్పు జరిగితే నాకు కచ్చితంగా తెలుస్తుంది. ఆమె ఇంకా బతికే ఉన్నందుకు సంతోషంగా ఉంది.'అని అన్నారు.  

అంతే కాకుండా ఆమె ధైర్యవంతురాలైన భారతీయ మహిళ అని సామ్ బాంబే ప్రశంసించారు. ఎవరైనా తమ కీర్తి, ప్రతిష్టను పూర్తిగా విస్మరించి ఒక సమస్యపై అవగాహన పెంచుకుంటే ప్రజలు గౌరవించాలని ఆయన సూచించారు. కాగా.. పూనమ్, సామ్ బాంబే 2020లో వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహబంధం ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయారు. హనీమూన్‌ తర్వాత భర్త భౌతికంగా వేధించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సామ్ బాంబేను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఈ జంట విడివిడిగానే ఉంటున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement