సౌత్‌లోని స్టార్ హీరోయిన్స్‌లో పూజా హెగ్డే ఒకరు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రముఖ హీరోలతో జతకట్టిందీ బ్యూటీ. తెలుగులోనే ఆమెకు ఎక్కువ హిట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు. తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్ నిరాశపర్చినా మంచి గుర్తింపయితే తీసుకొచ్చింది. విజయ్‌తో రెండోసారి జతకట్టిన జననాయకన్ మూవీపై చాలా ఆశలు పెట్టుకుంది. కానీ సెన్సార్ సమస్యల కారణంగా ఇప్పటివరకు ఈ సినిమా రిలీజవనేలేదు. ఎలాగైనా సరే జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
వీడియో వైరల్
ఇకపోతే పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. ఇకపోతే ఇటీవల ఓ యువకుడు పూజాతో సెల్ఫీ కోసం ప్రయత్నిస్తుంటే ఆమె పట్టించుకోలేదని ఓ వీడియో వైరలయింది. దానిపై తాజా ఇంటర్వ్యూలో పూజా మాట్లాడుతూ.. సినిమా వాళ్లకు జీవితాన్నిస్తోంది ప్రేక్షకులేనంది. పరిస్థితుల కారణంగా కొన్ని సమయాల్లో అభిమానులను పట్టించుకోకపోవచ్చని, అలాగని తామేదో పొగరు చూపిస్తున్నట్లు అర్థం కాదని తెలిపింది. ఇంకా చెప్పాలంటే అభిమానులే తమ దేవుళ్లు అని పేర్కొంది.


