చిరంజీవి ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం.. కేసు నమోదు | Police Case Filed On Youtube Channel For Chiranjeevi Health Rumors | Sakshi
Sakshi News home page

చిరంజీవి ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం.. కేసు నమోదు

May 27 2026 9:47 AM | Updated on May 27 2026 11:15 AM

Police Case Filed On Youtube Channel For Chiranjeevi Health Rumors

మెగాస్టార్‌ చిరంజీవి ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబ్‌ చానల్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 27లో ‘మూవీ మిస్టరీ-యూ7 జెడ్‌’ యూట్యూబ్‌ చానల్‌ కార్యాలయం ఉంది. ఆ చానల్‌లో సినీ హీరో చిరంజీవిని తివ్ర అనారోగ్యానికి గురైనట్లు చూపించడమే కాకుండా బట్టతల, బరువు తగ్గిపోయినట్లు ఫోటోలను మార్ఫింగ్‌ చేసి ప్రసారం చేశారని న్యాయవాది పేర్కొన్నారు. 

సంబంధిత స్క్రీన్‌ షాట్లు, వీడియోలు సమర్పిస్తూ చానల్‌ నిర్వాహకులను గుర్తించి పరువు నష్టం కలిగించేలా ఉన్న కంటెంట్‌ను తొలగించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. కోర్టు అనుమతితో పోలీసులు సంబంధిత యూట్యూబ్‌ చానల్‌ నిర్వాహకులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇక చిరంజీవి విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. ఇటీవల తన 158వ సినిమాను కూడా ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement