Naga Chaitanya: వివాదంలో నాగచైతన్య మూవీ! చిత్ర బృందంపై గ్రామస్తుల దాడి?

Permission Cancelled For Naga Chaitanya, Venkat Prabhu Movie For violating Rules - Sakshi

అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఎన్‌సీ 22 (#NC22)గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దేవాలయం ముందు బార్‌ సెట్‌ వేయడంతో గ్రామస్తులు మూవీ యూనిట్‌పై దాడి చేసినట్లు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వివరాలు.. నాగచైతన్య, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా వెంకట్‌ ప్రభు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

చదవండి: నయన్‌ను టార్గెట్‌ చేసిన నటి, నెట్టింట దూమారం రేపుతున్న ట్వీట్‌

ఇటీవలె సెట్‌పైకి వచ్చిన ఈ మూవీ కర్ణాటకలో మాండ్య జిల్లా మేల్కొటీ గ్రామంలో షూటింగ్‌ను జరుపుకుంటోంది. అదే గ్రామంలోని రాయగోపుర దేవాలయం సమీపంలో ఈ మూవీ షూటింగ్‌ సెట్‌ను ఏర్పాటు చేసి పలు కీలక సన్నివేశాలను చిత్రకరిస్తున్నారు. ఈ క్రమంలో దేవాలయం ముందు బార్‌ సెట్‌ వేసినట్లు తెలుస్తోంది. ఇక అది తెలిసి గ్రామస్తులు తీవ్ర మండిపాటుకు గురయ్యారట. దేవాలయం ముందే బార్‌ సెట్‌ వేయడంపై వారు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారని, నిత్యం పూజలు జ‌రిగే పవిత్ర దేవాలయం ముందు బార్ సెటప్‌లు వేసి అప‌విత్రం చేశారంటూ గ్రామస్తులు చిత్ర బృందపై దాడి చేసినట్లు సమాచారం. ఆ సమయంలో హీరో నాగచైతన్య కూడా సెట్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: మంచు మనోజ్‌ రెండో పెళ్లి వార్తలపై మంచు లక్ష్మి స్పందన

అంతేకాదు ఈ మూవీ యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని ఆ ఊరి ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారట. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం హీరో నాగచైతన్య, దర్శక-నిర్మాతలకు జరిమాన విధించినట్లు కూడా తెలుస్తోంది. కాగా ఈ మూవీ షూటింగ్‌ కోసం చిత్ర బృందం మాండ్య జిల్లా డీసీ అశ్విని అనుమతి కోరగా.. రెండు రోజుల షూటింగ్‌కు మాత్రమే పర్మిషన్‌ ఇచ్చారట. కానీ దానిని చిత్ర బృందం అతిక్రమించిందని, రెండు రోజులు దాటిన షూటింగ్‌ కొనసాగించారని తెలుస్తోంది. ఈ షూటింగ్‌లో బార్‌ సీన్‌ ఉన్నట్లు ముందుగా సమాచారం ఇవ్వలేదనే వాదన కూడా వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే చిత్ర బృందం స్పందించే వరకు వేచి చూడాల్సిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top