ఇద్దరు పిల్లల తండ్రిని కిడ్నాప్‌ చేసి పెళ్లి చేసుకున్న నటి?! | Parijatham Serial Fame Rasna Baiju Devaraj Love Marriage And Life Story In Telugu - Sakshi
Sakshi News home page

నటి ప్రేమను ఒప్పుకోని పేరెంట్స్‌.. ఇద్దరు పిల్లల తండ్రిని కిడ్నాప్‌ చేసి పెళ్లి?

Aug 25 2023 3:29 PM | Updated on Aug 25 2023 3:59 PM

Parijatham Serial Fame Rasna Baiju Devaraj Love And Life Story - Sakshi

నటి పెళ్లిని ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. అందుకు కారణం దర్శకుడికి అప్పటికే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు.

నటి రస్నా.. మలయాళ బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమున్న పేరు. మలయాళంలో పారిజాతం సీరియల్‌ చూసిన ఎవ్వరూ ఈమెను అంత ఈజీగా మర్చిపోలేరు. ఇందులో ఆమె ద్విపాత్రిభినయం చేసి తన నటనతో అందరినీ మెప్పించింది. తర్వాత ఈ సీరియల్‌ తమిళ, కన్నడ భాషల్లోనూ రీమేక్‌ అవగా అక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. ఇంతలా పాపులారిటీ తెచ్చుకున్న రస్నా కొంతకాలానికి ఉన్నట్లుండి స్మాల్‌ స్క్రీన్‌పై కనిపించకుండా పోయింది. దానికి గల కారణమేంటో చూద్దాం..

సీరియల్స్‌తో ఫేమస్‌
రస్నా ఆరో తరగతి చదువుతున్నప్పుడే తొలిసారి కెమెరా ముందుకు వచ్చింది. మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లో నటించింది. తర్వాత అమ్మక్కై సీరియల్‌లో కనిపించింది. అక్కడ క్లిక్‌ అవడంతో పారిజాతం ఆఫర్‌ వచ్చింది. అప్పటికి ఆమె ఇంకా ఇంటర్‌ చదువుతోంది. ఈ ధారావాహిక తర్వాత ఆమె సింధూరచెప్‌, వెళంకన్ని మాటవ్‌, బృందావనం, వధు అండ్‌ నందనం వంటి సీరియల్స్‌ చేసింది. బుల్లితెరపై స్టార్‌గా వెలుగొందుతున్న రోజుల్లో ఆమె దర్శకనిర్మాత బైజు దేవరాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత నటనకు పూర్తిగా దూరమైంది నటి.

ప్రేమను వ్యతిరేకించిన కుటుంబం
వీరిద్దరిదీ ప్రేమ వివాహం. ఇతడి కోసం మతం మార్చుకున్న రస్నా తన పేరును సాక్షిగా మార్చుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు దేవానంద(7), విఘ్నేశ్‌(5) సంతానం. అయితే రస్నా పెళ్లిని ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. అందుకు కారణం దర్శకుడికి అప్పటికే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. ఇది అభిమానులకు సైతం నచ్చలేదు. రస్నా, దేవరాజ్‌ మధ్య ఏజ్‌గ్యాప్‌ కూడా చాలా ఎక్కువే! అతడితో పెళ్లేంటని ఫ్యాన్స్‌ సైతం వ్యతిరేకత వ్యక్తం చేశారు.

భర్త బిజినెస్‌ చూస్తున్న నటి
ఇద్దరు పిల్లల తండ్రిని కిడ్నాప్‌ చేసి పెళ్లి చేసుకుందన్న ఆరోపణలు వచ్చాయి. కానీ వీళ్లు దాన్ని పట్టించుకోలేదు. ఎవరేమనుకున్నా తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి జీవిస్తున్నారు. అంతే కాదు, దేవరాజ్‌ తీస్తున్న కొత్త సీరియల్‌ ప్రమోషన్స్‌లోనూ చురుకుగా పాల్గొంది రస్నా. సోషల్‌ మీడియాలోనూ సీరియల్‌ను ప్రమోట్‌ చేసింది. భర్త బిజినెస్‌ వ్యవహారాలను సైతం చూసుకుంటోంది.

చదవండి: బన్నీకి జాతీయ అవార్డు.. లేట్‌గా విష్‌ చేసిన చరణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement