క్రికెటర్‌తో పెళ్లి.. వెంటనే పేరు మార్చేసుకున్న నటి | Sakshi
Sakshi News home page

Sana Javed: క్రికెటర్‌తో రెండో పెళ్లి.. అప్పుడే పేరు మార్చేసుకుందిగా!

Published Sat, Jan 20 2024 5:35 PM

Pakistani Actor Sana Javed Changed Name after Nikah with Shoaib Malik - Sakshi

ప్రేమ, పెళ్లి, విడాకులు.. సినిమా ఇండస్ట్రీలో తరచూ వినిపించే పదాలు. అయితే సెలబ్రిటీల సినిమాలు, ఈవెంట్లు.. లేదంటే వారి ప్రేమ ముచ్చట్లు, పెళ్లి విశేషాలు, విడాకుల వార్తలే ఎక్కువగా వినిపిస్తూ, కనిపిస్తూ ఉంటాయి. అలా ఈరోజు పాకిస్తాన్‌ నటి పెళ్లి చర్చనీయాంశంగా మారింది. క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను రెండో పెళ్లి చేసుకుంది పాక్‌ నటి సనా జావెద్‌. గతకొంతకాలంగా షోయబ్‌తో సన్నిహితంగా మెదులుతున్నా ఇలా సడన్‌గా నిఖా చేసుకుని షాకిస్తారని ఎవరూ ఊహించలేదు.

సానియాకు విడాకులు..!
ఎందుకంటే షోయబ్‌ తన భార్య సానియా మీర్జాకు విడాకులిచ్చినట్లు ఎక్కడా వెల్లడించలేదు. ఏదో చిన్న సమస్యలు అనుకున్నారే తప్ప నిజంగానే విడిపోయి ఇంత త్వరగా మరో అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభిస్తాడని ఎవరూ అనుకోలేదు. చివరకు శనివారం (జనవరి 20)నాడు షోయబ్‌- సనా జావెద్‌ షాదీ చేసుకుని ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. క్షణాల్లో ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా తన పేరును కూడా మార్చేసుకుంది సనా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ నటి తన పేరును సనా షోయబ్‌ మాలిక్‌గా మార్చుకుంది.

ఎవరీ సనా జావెద్‌?
కాగా సనా జావెద్‌.. సుఖూన్‌, షేర్‌ ఇ జాత్‌, ఇంతేజార్‌ వంటి సీరియల్స్‌లో నటించి గుర్తింపు పొందింది. ఈమె గతంలో పాకిస్తానీ గాయకుడు ఉమైర్‌ జస్వాల్‌ను పెళ్లాడింది. 2020లో నిఖా చేసుకున్న వీరు మొదట్లో బాగానే ఉన్నారు. కానీ తర్వాత ఇద్దరి మధ్య పొరపచ్చాలు మొదలయ్యాయి. గతేడాది ఇద్దరూ తమ పెళ్లి ఫోటోలను తొలగించడంతో విడాకులు తీసుకున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పుడదే నిజమని నిరూపిస్తూ క్రికెటర్‌ను పెళ్లాడింది.

whatsapp channel

Advertisement
Advertisement