ఓ తండ్రి తీర్పు | Sakshi
Sakshi News home page

ఓ తండ్రి తీర్పు

Published Mon, Jun 5 2023 3:56 AM

o thandri theerpu post production starts - Sakshi

రాజేందర్‌ రాజు కాంచనపల్లి, సురభి శ్రావణి జంటగా ఆరిగపూడి విజయ్‌ కుమార్‌ సమర్పణలో శ్రీరామ్‌ దత్తి నిర్మించిన చిత్రం ‘ఓ తండ్రి తీర్పు’. ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ‘‘ప్రేమ, ఆప్యాయతలు పంచుకోవాల్సిన తల్లిదండ్రులు, పిల్లల స్వార్థపు మత్తులో ఎలా దూరం అవుతున్నారు? ఎంత మానసిక క్షోభకు గురవుతున్నారు? అనేది ఈ చిత్రకథాంశం.

ఇందులో రాజేంద్ర రాజు ఆత్మీయత పంచే అల్లుడుగా నటించారు. ఆయన రాసిన ‘అమ్మానాన్నలు తెగిన గాలిపటాలు..’ టైటిల్‌ సాంగ్‌ విన్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకుంటారు. అలాగే క్లైమాక్స్‌లో ఆయన రాసిన డైలాగ్స్‌ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే విధంగా ఉంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేష్‌ చెటిపల్లి, సంగీతం: బాపు శాస్త్రి, రచన–దర్శకత్వ పర్యవేక్షణ: రాజేంద్ర రాజు కాంచనపల్లి.

Advertisement
 
Advertisement
 
Advertisement