
హాలీవుడ్ హర్రర్ చిత్రాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రేక్షకులను భయపెట్టాలన్నా.. థ్రిల్లింగ్‌కు గురిచేయాలన్నా హాలీవుడ్ చిత్రాలకే సాధ్యం. ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లను కొల్లగొట్టేవి ఇలాంటి చిత్రాలే. ది కంజూరింగ్ అనే చిత్రాన్నే తీసుకుంటే ప్రపంచంలోనే అత్యధికంగా వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అదే విధంగా హాలీవుడ్‌లో ది నన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: పవన్ కల్యాణ్ ఓజీపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్..! )
తాజాగా దానికి సీక్వెల్‌గా వస్తోన్న చిత్రం నన్ -2. ఇది ది కంజూరింగ్ ఫ్రాంచైజీలో రూపొందిన 9వ చిత్రం కావడం మరో విశేషం. మైఖేల్ ఛావ్స్ దర్శకత్వం వహించిన ఈ అమెరికన్ చిత్రంలో బోలి ఆరోన్‌న్స్, తెలుసా ఫార్మికా, స్టీమ్ రెయిడ్, ప్రధాన పాత్రలు పోషించారు. న్యూలైన్ సినిమా ఆటోమిక్ మాన్‌స్టర్, ది సఫ్రాన్ కంపెనీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించారు.
ఒక దేవత లాంటి యువతి దెయ్యంగా ఎలా మారింది? అన్న ఇతివృత్తంతో నన్–2 తెరకెక్కించారు. ఈ చిత్రం కథ, కథనం, స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయని వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. ఈ చిత్రం భారతదేశంలో తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ఈనెల 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
(ఇది చదవండి: గోపీచంద్‌ని తిట్టడం తప్పే.. ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన డైరెక్టర్)
On September 8th, the greatest evil in the conjuring universe returns #TheNun2. pic.twitter.com/zYdo2dzwVR
— Warner Bros. Pictures (@wbpictures) July 6, 2023