హైదరాబాద్‌ చేరుకున్న తారక్‌, చరణ్‌ | NTR And Ram Charan Returns To Hyderabad From Ukraine Along With RRR Movie Team | Sakshi
Sakshi News home page

RRR Movie: హైదరాబాద్‌ చేరుకున్న ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌

Aug 19 2021 8:05 PM | Updated on Aug 19 2021 8:05 PM

NTR And Ram Charan Returns To Hyderabad From Ukraine Along With RRR Movie Team - Sakshi

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపోందుతున్న ఈ చిత్రం ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. అయితే రెండు పాటల బ్యాలెన్స్‌ ఉండగా ఆ పాటల చిత్రీకరణలో భాగంగా ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ టీం ఉక్రెయిన్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ  రామచరణ్‌, ఎన్టీఆర్‌లతో తీసే ఈ పాటల చిత్రీకరణ పూర్తి కావడంతో బుధవారం రాత్రి ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం ఇండియాకు చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కాగా నిన్న రాత్రి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నుంచి చరణ్‌, తారక్‌లు బయటకు వస్తున్న ఫొటోలను కొంతమంది తమ కెమెరాల్లో బంధించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో అవి వైరల్‌గా మారాయి. అంతేగాక షూటింగ్‌ పూర్తి కావడంతో ఉక్రెయిన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ టీం సెలబ్రెషన్స్‌ చేసుకున్న ఫొటోలు, వీడియోలు కూడా హల్‌చల్‌ చేస్తున్నాయి. చివరి షెడ్యూల్ పూర్తి కావ‌డంతో దర్శకుడు రాజమౌళితో పాటు చిత్ర బృందం కేక్‌ చేశారు. ఈ మూవీలో చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియాభ‌ట్ సీత పాత్రలో కనిపించనుండగా.. హాలీవుడ్ న‌టి ఒలివియా ఎన్టీఆర్ స‌ర‌స‌న‌ న‌టిస్తోంది. శ్రియా శ‌ర‌ణ్‌, అజ‌య్ దేవగన్‌లు కీల‌క పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబ‌ర్ 13న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు సమాచారం. ఇక మరో విశేషం ఎంటంటే ఉక్రెయిన్‌ నుంచి ఇంటికి వచ్చిన తారక్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌ అందింది. ఇటివల ఆయన బుక్‌ చేసిన లంబోర్గిని ఉరుస్‌ కారు నిన్ననే ఇంటికి చేరుకుంది. దీంతో ఆయన ఉక్రెయిన్‌ వచ్చిన తారక్‌కు ఇంటి ముందుకు ఆయన ఇష్టంగా బుక్‌ చేసుకున్న ఈ కారు దర్శనం ఇవ్వడంతో సర్‌ప్రైజ్‌ అయినట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement