
గత కొంతకాలంగా వస్తున్న విడాకుల రూమర్స్‌కు చెక్ పెడుతూ విడాకులు మంజూరైన విషయాన్ని జూలై ప్రారంభంలో సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇకపోతే నిహా
సాక్షి, మాదాపూర్: ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వస్త్రాభరణాలు నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఆదివారం హైలైఫ్ ఎగ్జిబిషన్‌ను నటి నిహారిక కొణిదెల నిర్వాహకుడు డొమినిక్‌తో కలిసి ప్రారంభించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలోని 350 మంది టాప్ డిజైనర్లు రూపొందించిన ఉత్పత్తులు ఉన్నాయన్నారు. స్టైల్, డెకార్, లెగ్జరీ, ఫ్యాషన్ జ్యూలరీ, యాక్ససరీస్ తదితర ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో యాక్టివిటిస్ట్ ఎస్.సబితారెడ్డి, నటీమణులు ఐశ్వర్య వెల్లింగుల, శాన్విమెఘన పాల్గొన్నారు.
కాగా నిహారిక ఇటీవలే తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే! గత కొంతకాలంగా వస్తున్న విడాకుల రూమర్స్‌కు చెక్ పెడుతూ విడాకులు మంజూరైన విషయాన్ని జూలై ప్రారంభంలో సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇకపోతే నిహారిక వెండితెరకు పరిచయమయ్యే ముందు బుల్లితెరపై వ్యాఖ్యతగా చేసింది. తర్వాత ‘ముద్దపప్పు ఆవకాయ్’ అనే లఘు చిత్రంలో నటించించింది. ‘ఒక మనసు’ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత ‘సూర్యకాంతం’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాల్లో నటించింది.
నాన్న కూచి, మ్యాడ్ హౌస్ వంటి వెబ్ సిరీస్‌లోనూ నటించిన ఆమె కొంతకాలం పాటు సినిమాలకు విరామం ఇచ్చింది. ఇటీవలే డెడ్ పిక్సెల్స్ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చింది. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన నిహారిక నిర్మాతగానూ అవతారమెత్తింది. ఈ సంస్థ నుంచి వచ్చిన ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, ‘హాలో వరల్డ్’ సిరీస్‌లు ప్రేక్షకాదరణ పొందాయి.