'మీ ముఖాన్ని దాచుకునే పనులు చేయొద్దు'.. రాజ్‌ కుంద్రాపై ట్రోలింగ్‌ | Netizens Trolls Raj Kundra For Hiding His Face | Sakshi
Sakshi News home page

Raj Kundra: మొహాన్ని దాచుకున్న రాజ్‌ కుంద్రా.. నెటిజన్స్‌ ట్రోలింగ్‌

Nov 26 2021 9:10 PM | Updated on Nov 27 2021 7:38 AM

Netizens Trolls Raj Kundra For Hiding His Face - Sakshi

Netizens Trolls Raj Kundra For Hiding His Face: ఇటీవల కాలంలో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా దంపతులు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం సమస్యలు కొంచెం సద్దుమణిగాయి. ఇద్దరూ కలిసి ఆలయాలు సందర్శించడం, టూర్‌లకు వెళ్లడం, కొంత సమయం గడపడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలో కూడా రాజ్‌ కుంద్రాను ట్రోలింగ్ రూపంలో దురదృష్టం వెంటాడింది. గురువారం రాజ్‌ కుంద్రా, శిల్పాశెట్టి ముంబై విమానాశ్రయం నుంచి ఏదో ప్రదేశానికి బయలుదేరారు. ఆ వీడియోను ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ వైరల్‌ భయానీ ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. అది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 

ఆ వీడియోలో శిల్పా శెట్టి, రాజ్‌ కుంద్రా వేరువేరుగా తమ కార్ల నుంచి దిగి విమానాశ్రయం గేట్ల వైపు నడుచుకుంటూ వెళ్లారు. కారు నుంచి దిగిన వెంటనే రాజ్‌ కుంద్రా కెమెరాలకు చిక్కకుండా హడావుడిగా ఎయిర్‌పోర్ట్ లోపలికి వెళ్లాడు. ఎయిర్‌పోర్ట్‌లో పాప్‌ స్టేషన్‌ వద్ద ఆగకుండా ఫోన్‌ చూస్తూ వెళ్లిపోయాడు. అలాగే తన ముఖం పూర్తిగా కనపడకుండా ఉండేలా బ్లాక్‌ హుడీ ధరించాడు రాజ్ కుంద్రా. ఆ వీడియోలో శిల్పా శెట్టి ప్రశాంతంగా కారు దిగి ఎయిర్‌పోర్ట్‌ గేట్ల వద్దకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. నీలం డెనిమ్‌, వైట్‌ స్నీకర్‌తో తెల్లటి చారల బ్లేజర్‌ను ధరించారు శిల్పా. 


ఇది గమనించిన నెటిజన్లు ఆ పోస్ట్‌పై అనేక రకాలుగా కామెంట్స్‌ పెట్టారు. రాజ్‌ కుంద్రా తన ముఖం కవర్‌ చేసుకున్నందుకు తెగ ట్రోల్‌ చేశారు. 'మీ ముఖాన్ని దాచుకునే పనులు చేయొద్దు' అని ఒక యూజర్‌ కామెంట్‌ పెడితే, 'మీరు కూడా చూడకూడని పనులు చేయకండి' అని రాసుకొచ్చాడు.  'అప్పుడే సిగ్గులేని వాళ‍్లు మొహం దాచుకోవడం చూసి నవ్వుతారు' అని ఒకరన్నారు. 'అతను కెమెరా చూసి ఎందుకు మొహం దాచుకుంటున్నాడు. కెమెరా వెనుక ఉండి డైరెక్ట్‌ చేసినప్పుడు రాని సిగ్గు ఇప్పుడెందుకు' అని మరొకరు ఘాటుగా కామెంట్ చేశారు.

ఇది చదవండి: వివాహ వార్షికోత‍్సవం.. పెళ్లినాటి ఫొటోలు వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement