‘నేనెవరు?’.. మే 29న తెలుస్తుంది | Nenevaru Movie Release Date Out | Sakshi
Sakshi News home page

వినోదం, సస్పెన్స్ మేళవింపుతో ‘నేనెవరు?’

May 26 2026 5:57 PM | Updated on May 26 2026 6:33 PM

Nenevaru Movie Release Date Out

రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘నేనెవరు?’. చిరంజీవి తన్నీరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘నువ్వేకావాలి’, ‘ప్రేమించు’ వంటి సూపర్ హిట్ చిత్రాల ఫేమ్ సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. భావోద్వేగాలు, వినోదం, సస్పెన్స్ మేళవింపుతో దర్శకుడు చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ప్రతి వ్యక్తి జీవితానికి సంబంధించిన ప్రశ్నను ప్రతిబింబించేలా “నేనెవరు?” అనే టైటిల్‌కు తగ్గట్టుగా ఆసక్తికరమైన కథనాన్ని సిద్ధం చేసినట్లు మేకర్స్ పేర్కొన్నారు. 

ముఖ్యంగా క్లైమాక్స్,  రాజేంద్ర ప్రసాద్ నటన ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయని తెలిపారు. టెక్నికల్‌గా కూడా సినిమా మంచి స్థాయిలో రూపొందిందని, సంగీతం, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చిత్రానికి ప్రత్యేక బలంగా నిలుస్తాయని చిత్రబృందం వెల్లడించింది.  మే 29న థియేటర్లలో విడుదల కానున్న “నేనెవరు?” చిత్రం ప్రేక్షకులకు వినోదంతో పాటు మంచి సందేశాన్ని అందించే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement