ప్రియుడితో నయనతార.. ప్రత్యేక విమానంలో

Nayanthara Her Boyfriend Vignesh Shivan Jets Off To Kochi Video Viral - Sakshi

చెన్నై: కోలీవుడ్‌లో సంచలన జంట ఎవరంటే నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ అని ఠక్కున సమాధానం వస్తుంది. ఈ జంట పెళ్లి చేసుకోరు. కనీసం ప్రేమించుకుంటున్నాం అని కూడా చెప్పరు. అయినా సహజీవనం చేస్తున్నారు. కలిసి ఏ దేశానికి విహారయాత్రలకు వెళ్లినా, పుట్టిన రోజు, రెండు రోజు వేడుకలను జరుపుకున్నా వెంటనే ఆ ఫొటోలను మీడియాకు విడుదల చేసి వార్తల్లో చర్చనీయాంశంగా మారుతుంటారు. కాగా ప్రస్తుతం మరోసారి ఈ సంచలన జంట వార్తల్లోకెక్కారు.

శనివారం చెన్నై నుంచి ప్రత్యేక చార్టెడ్‌ ఫ్లైట్‌లో కొచ్చిన్‌కి వెళ్లారు. ఆ ఫొటోలను దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రయాణానికి సంబంధించిన వీడియోను నయనతార తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకున్నారు. ఇదంతా ఇలా ప్రత్యేక విమానంలో వెళ్లడం రెండోసారి. గత ఏడాది ఓనం పండుగ వేడుకలను జరుపుకోవడానికి నయనతార చెన్నై నుంచి కొచ్చిన్‌కు ప్రత్యేక విమానంలో వెళ్లారు. తాజాగా ఈ నెల 14వ తేదీన కొత్త సంవత్సరాన్ని కేరళీయులు విషు వేడుక పేరుతో ఘనంగా జరుపుకుంటారు. ఆ వేడుక జరుపుకోవడానికి నయనతార, విఘ్నేష్‌ శివన్‌ ప్రత్యేక విమానంలో వెళ్లారు.
చదవండి: నీటి లోపల మెహరీన్‌ లవ్‌ ప్రపోజల్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top