లోకేశ్‌ కనగరాజ్‌ సినిమా నుంచి నయన్‌ అవుట్‌, బాలీవుడ్‌ కోసమేనా? | Nayanthara Do Second Movie In Bollywood With Sanjay Leela Bhansali Baiju Bawra Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Nayanthara Bollywood Movie: బాలీవుడ్‌లో రెండో సినిమా చేయనున్న నయనతార

Oct 11 2023 10:29 AM | Updated on Oct 11 2023 12:02 PM

Nayanthara Do Second Movie in Bollywood - Sakshi

తాజాగా మరో బాలీవుడ్‌ చిత్రం నయనతారను వరించినట్లు ప్రచారం జోరందుకుంది. బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం

దక్షిణాదిలో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న నయనతార ద్వితీయ చిత్రానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. అదేంటి.. 75 చిత్రాల మైలు రాయిని టచ్‌ చేసిన నయనతార ఇప్పుడు రెండవ చిత్రానికి సిద్ధం అవడమేంటి అనుకుంటున్నారా? దక్షిణాదిలో 75 పైగా చిత్రాలు చేసినా బాలీవుడ్‌లో మాత్రం ఒక చిత్రం మాత్రమే చేశారు. ఇటీవలే షారుక్‌ఖాన్‌ జంటగా జవాన్‌ చిత్రంలో నటించారు. కోలీవుడ్‌ యువదర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

దీంతో నయనతార పేరు నార్త్‌ ఇండియాలోనూ మారు మోగుతోంది. తాజాగా మరో బాలీవుడ్‌ చిత్రం నయనతారను వరించినట్లు ప్రచారం జోరందుకుంది. బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం బైజుబవ్రా. ఇది 1950లో జరిగే మ్యూజికల్‌ పీరియాడికల్‌ డ్రామాగా ఉంటుందని సమాచారం. ఇందులో రణ్‌వీర్‌సింగ్‌, అలియాభట్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ క్రేజీ చిత్రం ఇప్పటికే షూటింగ్‌ దశలో ఉంది. కాగా ఇందులో ఒక ప్రముఖ పాత్ర కోసం నయనతారను సంప్రదించినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ నిర్మిస్తున్న ఓ చిత్రం నుంచి నయనతార వైదొలగడంతో హిందీ చిత్రం కోసమే తను అందులో నుంచి తప్పుకుందనే టాక్‌ వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం ఈమె తన 75వ చిత్రంతో పాటు మన్నాంగట్టి, ది టెస్ట్‌ అనే చిత్రాల్లో నటిస్తున్నారు.

చదవండి: బాల్యంలోనే రెండుసార్లు అత్యాచారం.. బిగ్‌బాస్‌ చరిత్రలోనే రికార్డ్ రెమ్యునరేషన్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement