భయం, భయంగానే ‘నారప్ప’చేశాం : సురేశ్‌ బాబు

Narappa Movie: Suresh Babu Shares Shooting Experience - Sakshi

విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నారప్ప’. తమిళ సినిమా అసురన్‌కి రీమేక్‌ ఇది.  శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్‌ బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మించారు. ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది. జూలై 20న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సురేశ్‌ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘నారప్ప’షూటింగ్‌ అనుభవాలను పంచుకున్నాడు. 

‘కరోనా కారణంగా భయం, భయంగానే ‘నారప్ప’షూటింగ్‌ చేశాం. మొదట తమిళనాడు షూటింగ్ చేస్తున్న సమయంలో 6 కిలో మీటర్ల దూరంలో రెండు పాజిటివ్ కేసులు నమోదైనట్లు న్యూస్ రాగానే భయంతో అక్కడి నుంచి షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని పారిపోయాం. ఫస్ట్‌ వేవ్‌లో రెండు మూడు కేసులు వస్తేనే చాలా భయపడిపోయి షూటింగ్‌ని రద్దు చేసుకున్నాం. కానీ సెకండ్‌ వేవ్‌లో వేల సంఖ్యలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వచ్చినా పెద్దగా కంగారు పడలేదు. కానీ చాలా జాగ్రత్తలు తీసుకొని షూటింగ్‌ని పూర్తి చేశాం.‘నారప్ప’నాన్‌ షూటింగ్‌ టైమ్‌లో ఈ సినిమాకు సంబంధించిన నలుగురు చనిపోయారు. జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రాణాలు పొగొట్టుకోవాల్సివస్తుంది’అని సురేశ్‌ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

వెంకటేశ్‌ సిన్సియర్‌గా వర్క్‌ చేశాడు
‘నారప్ప’ లాంటి కథలను ఎవరూ వెంకటేశ్‌ కోసం రాయరు. ఈ సినిమాలో వెట్రిమారన్‌ స్టైల్‌ నాకు నచ్చింది. మాస్‌ ఎలిమెంట్స్‌తో పాటు భారీ ఫ్యామిలీఎమోషన్స్, సామాజిక అంశాలు ఉన్నాయి. సో.. ఈ సినిమా వర్కౌట్‌ అవుతుందని అనిపించింది. యాక్టర్‌గా వెంకటేశ్‌ చాలా బాగా చేశాడు. ఇంట్రవెల్‌కు ముందు ఇసకలో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌తీశాం. అది చాలా కష్టం. వెంకటేశ్‌ అయితే చాలా సిన్సియర్‌గా వర్క్‌ చేశాడు. ఎప్పుడు నారప్ప గెటప్‌లోనే కనిపించారు. బ్యాలెన్స్‌ షూట్‌ కోసం మెంటల్‌గా ప్రిపేర్‌ అయ్యాడు. నారప్ప సినిమా రైట్స్‌ తీసుకున్న తర్వాత శ్రీకాంత్‌ అడ్డాల ఓ సారి వచ్చి ఓ కథ చెప్పారు. ఆ తర్వాత నారప్ప సినిమా గురించి మాట్లాడుకున్నాం. శ్రీకాంత్‌ అడ్డాల డైరెక్ట్‌ చేస్తానన్నారు. చాలా బాగా తెరకెక్కించారు’అని సురేశ్‌ బాబు అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top