ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. 10వ తరగతిలోనే ఆ పొరపాటు చేయడంతో.. | Sakshi
Sakshi News home page

ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. 10వ తరగతిలోనే ఇంట్లో దొరికిపోయి దెబ్బలు తినిందట

Published Wed, Dec 20 2023 6:47 AM

Narappa Actress Ammu Abhirami Reveal her Love Story - Sakshi

కోలీవుడ్‌లో కథానాయకిగా ఎదుగుతున్న నటి అమ్ము అభిరామి. ఈమె తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తున్నారు. భైరవ, ఎన్‌ ఆవిడ చెరుప్పు కానోమ్‌, ధీరన్‌ అధికారం ఒండ్రు వంటి చిత్రాల్లో సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌ చేసిన అమ్ము అభిరామి రాక్షసన్‌ చిత్రంలో పాఠశాల విద్యార్థినిగా నటించి గుర్తింపు పొందారు. ఇదే సినిమా తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్‌ రాక్షసుడు పేరుతో హిట్‌ కొట్టారు.  ఆ తరువాత ధనుష్‌ కథానాయకుడిగా నటించిన అసురన్‌ చిత్రంలో ఆయన మరదలుగా నటించారు.

తెలుగులో వెంకటేశ్‌ నారప్ప చిత్రంలో కన్నమ్మ పాత్రలో మెప్పించారు. సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్‌లో వెంకటేశ్‌ ప్రేయసిగా అభిరామి మంచి గుర్తింపు పొందింది.  అదేవిధంగా కుక్‌ విత్‌ కోమాలి టీవీ కార్యక్రమంలో పాల్గొని పాపులర్‌ అయిన అమ్ము అభిరామి పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమె తాజాగా నలుగురు కథానాయికల్లో ఒకరిగా నటించిన కన్నగి చిత్రం ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలతో ప్రదర్శింపబడుతోంది. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో ప్రేమ గురించి పేర్కొంటూ తాను స్కూల్లో 10వ తరగతి చదువుతున్నప్పుడే సహ విద్యార్థి ప్రేమలో పడ్డానని, ఆ విషయం ఇంటిలో తెలిసి దొరికి పోయానని చెప్పారు.

అది వన్‌ సైడ్‌ లవ్వే అయినా దాచుకోలేక ఇంటిలో దొరికిపోయి దెబ్బలు తిన్నానని చెప్పారు. ఆ సంఘటనను ఎప్పటికీ మరచిపోలేనన్నారు. ఎలాంటి భర్త రావాలని కోరుకుంటున్నారనే ప్రశ్నకు తనను అర్థం చేసుకునే వాడు అయితే చాలు అని బదులిచ్చారు. అది ప్రేమ వివాహం అయినా సరే పెద్దలు నిశ్చయించిన వివాహం అయినా సరే అని అమ్ము అభిరామి పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈమె చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. గోలీ సోడా 1.5 అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించారు.

 
Advertisement
 
Advertisement