Nandamuri Balakrishna: బాలకృష్ణ చేతుల మీదుగా లవ్‌ రెడ్డి పోస్టర్‌ రిలీజ్‌

Nandamuri Balakrishna Released Love Reddy Poster - Sakshi

అంజన్‌ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌ రెడ్డి’. ఈ సినిమాతో స్మరణ్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎమ్జీఆర్‌ ఫిలిమ్స్, గీతాన్ష్‌ ప్రొడక్షన్స్, సెహరి స్టూడియోస్‌ బ్యానర్స్‌పై హేమలతా రెడ్డి, మదన్‌ గోపాల్‌ రెడ్డి, ప్రభంజన్‌ రెడ్డి, నాగరాజు బీరప్ప నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ పోస్టర్‌ను నందమూరి బాలకృష్ణ విడుదల చేసి, ‘యంగ్‌ టీమ్‌ కలిసి చేస్తున్న ‘లవ్‌ రెడ్డి’ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు.

‘‘ఆంధ్ర–కర్ణాటక సరిహద్దులో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథ ‘లవ్‌ రెడ్డి’. 80 శాతం షూటింగ్‌ పూర్తయింది. మిగిలిన భాగాన్ని కర్ణాటకలోని బాగేపల్లి, చిక్‌బల్లాపూర్, బెంగళూరులో చిత్రీకరించనున్నాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ప్రిన్స్‌ హెన్రీ, సహనిర్మాతలు: నవీన్‌ రెడ్డి, సుమలతా రెడ్డి, సుస్మితా రెడ్డి, హరీష్‌.

చదవండి: బాలీవుడ్‌లో కామాంధుడిని బయటపెడతా: సల్మాన్‌ మాజీ ప్రేయసి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top