ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలి: నాగ చైతన్య | Naga Chaitanya released Title Song Vey Daruvey Movie Lyrical Song | Sakshi
Sakshi News home page

Vey Daruvey Movie: ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలి: నాగ చైతన్య

Jan 25 2023 9:39 PM | Updated on Jan 25 2023 9:50 PM

Naga Chaitanya released Title Song Vey Daruvey Movie Lyrical Song - Sakshi

సాయి రామ్ శంకర్ , యాశ శివ కుమార్ జంటగా నటించిన చిత్రం 'వెయ్ దరువెయ్'.  సునీల్ , కాశి విశ్వనాథ్ , పోసాని కృష్ణ మురళి , పృథ్వి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నవీన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.  దేవరాజ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్‌ను హీరో నాగచైతన్య చేతులమీదుగా విడుదల చేశారు. 

నాగ చైతన్య మాట్లాడుతూ..' ఈ పాట చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. సినిమా చూడాలన్న కూతుహలాన్ని కలిగిస్తోంది. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవ్వాలి.సినిమా లో పని చేసిన వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంది.'అని అన్నారు. 

హీరో సాయి రామ్ శంకర్ గారు మాట్లాడుతూ.. 'నాగచైతన్య  చేతుల మీదుగా రిలీజ్ చేయటం చాలా ఆనందంగా ఉంది. మా సినిమా నుంచి ఇది రెండో సాంగ్. మొదట రిలీజైన మంజుల మంజుల సాంగ్‌కు చాల మంచి విశేష స్పందన వచ్చింది. ఈ సాంగ్ మరింత బాగా సక్సెస్ సాధిస్తుంది.' అని అన్నారు.  దర్శకుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. 'ఈ సినిమా కథ చెప్పగానే  సింగిల్ సిట్టింగ్ ఒప్పుకున్నారు హీరో సాయి. ఆయన నా మీద ఉంచిన నమ్మకాన్ని జయించాననే అనుకుంటున్నా. నా మీద నమ్మకం తో  ఈ అవకాశాన్ని  ఇచ్చిన ప్రొడ్యూసర్‌కు థాంక్స్'.అని అన్నారు. 

ప్రొడ్యూసర్ దేవరాజ్ మాట్లాడుతూ.. 'నవీన్ నాకు కథ చెప్పగానే ఎంతో నచ్చింది. కథ మీద నమ్మకంతో ముందుకు వచ్చా. మేము అనుకున్నట్టే చాలా బాగా వచ్చింది సినిమా. సాయి  కెరీర్‌లో మరొ మంచి సినిమా అవుతుందని గట్టిగా నమ్ముతున్నాం. అని అన్నారు. కాగా.. ఈ సినిమా ఫిబ్రవరి 24న రిలీజ్ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement