
కొత్త జీఎస్‌టీ సంస్కరణల వల్ల చిత్రపరిశ్రమలో కూడా కొంత ఉపశమనం లభించింది. అయితే, ఎక్కువమందికి ప్రయోజనం ఉండదని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్ సోషల్‌మీడియా ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి కీలక విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం కాస్త మార్పులు చేస్తే చాలామందికి లాభం చేకూరుతుందన్నారు.
కొత్త జీఎస్‌టీ మార్పుల ప్రకారం రూ. 100 లోపు టికెట్లను కొనుగోలు చేసే వారిపై 5 శాతం జీఎస్‌టీ పడుతుంది. గతంలో 12 శాతం ఉండేది. అయితే, రూ. 100 మించి టికెట్ ధర ఉంటే రూ. 18 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సిందే. ఇదే విషయంలో ప్రధానిని నాగ్ అశ్విన్ విజ్ఞప్తి చెశారు. ప్రస్తుతం చాలా తక్కువ థియేటర్లలో మాత్రమే రూ.100 లోపు ధరలతో టికెట్లు విక్రయిస్తున్నారని దీంతో ఎక్కువ మందికి లాభాదాయకంగా ఉండదన్నారు. 5 శాతం జీఎస్‌టీ శ్లాబ్‌ని కేవలం రూ.100 లోపు టికెట్లకే కాకుండా.. రూ.250 వరకూ పొడిగిస్తే బాగుంటుందని ఆయన కోరారు.