
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హృదయపూర్వం (Hridayapoorvam Movie). సంగీత్ ప్రతాప్, ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక కీలక పాత్రల్లో నటించారు. క్లాసిక్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ అయిన సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించాడు. ఆశీర్వాద్ సినిమా బ్యానర్‌పై ఆంటొని పెరుంబవూర్ నిర్మించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు. ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ కొట్టింది.

వచ్చేవారమే రిలీజ్
కేవలం రూ.30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.70 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ కేరళలోని పలు థియేటర్లలో ప్రదర్శితమవుతూనే ఉంది. సినిమా రిలీజై మూడువారాలు దాటిపోవడంతో ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. జియో హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 26న విడుదల చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.
వరుస హిట్లు
మోహన్‌లాల్ ఈ ఏడాది ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజవగా ఆ మూడు కూడా బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టాయి. ఎల్2: ఎంపురాన్ మూవీ ఏకంగా రూ.260 కోట్లు రాబట్టింది. మలయాళ సినీ చరిత్రలోనే రూ.250 కోట్లు దాటిన మొట్టమొదటి సినిమాగా రికార్డుకెక్కింది. తర్వాత తుడరుమ్ రిలీజ్ అవగా ఈ మూవీ కూడా రూ.230 కోట్లు వసూలు చేసింది. తర్వాత వచ్చిన హృదయపూర్వం రూ.70 కోట్లు కలెక్ట్ చేసింది. మరి మోహన్‌లాల్ మున్ముందు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి!
എന്ന് ഹൃദയപൂർവം ജിയോഹോട്ട്സ്റ്റാർ#Hridayapoorvam will be streaming from September 26 on JioHotstar. @mohanlal @antonypbvr @aashirvadcine @MalavikaM_#Hridayapoorvam #HridayapoorvamOnJioHotstar #Mohanlal #HridayapoorvamMohanlal #Family #Drama #Comedy #Malayalam #JioHotstar pic.twitter.com/r8Q1hL4JEv
— JioHotstar Malayalam (@JioHotstarMal) September 19, 2025
చదవండి: గాజులేసుకుని కూర్చో.. సుమన్‌పై సంజనా చీప్ కామెంట్స్