వెండితెర ఎంట్రీకి సిద్దమైన మరో మెగా వారసురాలు

Megastar Chiranjeevi Daughter Sushmita Tollywood Entry Soon - Sakshi

ప్రస్తుతం టాలీవుడ్‌లో మెగా హీరోల హవా నడుస్తోంది. దాదాపుగా మెగా వారసులంతా పరిశ్రమలో అడుగుపెట్టి తమ సత్తా చాటుతున్నారు. తాజాగా చిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ సైతం హీరోగా పరిచయమైన తన నటనతో మెప్పించాడు. మొదటి సినిమా ఉప్పెనతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టెసి దర్శక నిర్మాత దృష్టిని ఆకర్షించాడు. ఇక చిరంజీవి వారసుడు రామ్‌ చరణ్‌, మెగా బ్రదర్‌ నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌, మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌లు స్టార్‌ హీరోలుగా రాణిస్తున్నారు.

కాగా మెగా కుటుంబ నుంచి ఒకేఒక్క అమ్మాయి నిహరీక సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక తాజాగా చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా వెండితెర ఎంట్రీకి సిద్దమైందట. ఇప్పటికే క్యాస్టూమ్ డిజైనర్‌గా చిరు, చరణ్ చిత్రాలకు పని చేసిన సుస్మిత ఇటీవల తన‌ భర్త విష్ణుతో కలిసి ‘గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్’ స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్‌లో ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ పేరుతో ఓ వెబ్ సిరీస్‌ను కూడా నిర్మించారు.

ఇక ఆమె ఇప్పుడు వెండితెర‌పై త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ధ‌మైనట్లు సమచారం.ఇప్ప‌టికే 8 తొట్ట‌క‌ల్ అనే త‌మిళ సస్సెన్ష్‌ థ్రిల్లర్‌ మూవీని తెలుగు రీమేక్ హ‌క్కుల‌కు కొనుగోలు చేసినట్లు సమాచారం. తన సొంత బ్యానర్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సుస్మిత ఓ కీలక పాత్ర చేయనుందని వినికిడి. ఈ మూవీలో ఆమె ఓ యువ హీరోతో చేయ‌నుంద‌ట. కాగా కేసు విచార‌ణ‌లో పోలీసు త‌న రివాల్వ‌ర్ పోగొట్టుకోగా ఇది ఎన్నో ప‌రిణామాల‌కు దారి తీస్తుంది. ఈ లైన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నాలుగేళ్ల క్రితం త‌మిళంలో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. క‌న్న‌డ‌లోను రీమేక్ కాగా, అక్క‌డ భారీ హిట్ కొట్టింది.

చదవండి: 
‘బిల్లా’లో నా బికినీపై మా అమ్మ చేసిన వ్యాఖ్యలకు షాకయ్యా..
మహిళ ఫిర్యాదు.. యాంకర్‌ శ్యామల భర్త అరెస్ట్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top