Manchu Vishnu About House of Manchus Reality Show - Sakshi
Sakshi News home page

Manchu Vishnu: అలాంటివాళ్లకు దూరంగా ఉంటా.. మనోజ్‌తో గొడవపై మరోసారి..

Aug 17 2023 6:35 PM | Updated on Aug 17 2023 6:53 PM

Manchu Vishnu about House Of Manchus Reality Show - Sakshi

నేను ఉమ్మడి కుటుంబాన్ని నమ్ముతాను. కానీ ఆ కుటుంబం అలాగే కలిసి ఉండాలని చెప్పను. భార్యాపిల్లలతో రెస్టారెంట్‌కు, సినిమాకు ఎక్కడికి వెళ్లినా నాన్నగారికి చెప్పే వెళ్తా

మంచు కుటుంబంలో కలహాలంటూ గతంలో విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది. మనోజ్‌తో విష్ణు గొడవపడిన వీడియో బయటకు రావడంతో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఇదంతా నిజం కాదని, రియాలిటీ షోలో భాగమని విష్ణు ఆ మధ్య క్లారిటీ ఇచ్చాడు. 'హౌస్‌ ఆఫ్‌ మంచూస్‌' పేరిట త్వరలో ఓ పెద్ద రియాలిటీ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ప్రకటించాడు. ఐదు నెలలు కావస్తున్నా దీనిపై ఎటువంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు.

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో చర్చలు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు రియాలిటీ షో సహా, ఆస్తుల పంపకం, చిరుతో విబేధాలు.. తదితర అంశాలపై వివరణ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. 'హౌస్‌ ఆఫ్‌ మంచూస్‌ రియాలిటీ షో త్వరలో ఉండబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో చర్చలు జరుగుతున్నాయి. అది ఎలా రాబోతుందనేది ఆతృతతో ఎదురుచూస్తున్నాం. మనోజ్‌తో గొడవ నిజమా? కాదా? అని అడుగుతున్నారు. ఏడెనిమిది నెలల్లో మీకే తెలుస్తుంది' అని చెప్పుకొచ్చాడు.

ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం
ఆస్తులు పంచుకున్నారా? అన్న ప్రశ్నకు విష్ణు స్పందిస్తూ.. 'అంత అవసరమేంటి? నేను ఉమ్మడి కుటుంబాన్ని నమ్ముతాను. కానీ ఆ కుటుంబం అలాగే కలిసి ఉండాలని చెప్పను. భార్యాపిల్లలతో రెస్టారెంట్‌కు, సినిమాకు ఎక్కడికి వెళ్లినా నాన్నగారికి చెప్పే వెళ్తాను. అలా ఉంటేనే నాకిష్టం. అలాగే సినిమా షూటింగ్‌లో ఎవరైనా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే నాకు అస్సలు నచ్చదు. పెద్దలు, మహిళలకు గౌరవం ఇవ్వనివాళ్లతో నేను క్లోజ్‌గా ఉండలేను.​ నా నెక్స్ట్‌ సినిమా కన్నప్ప భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాం. నేను చాలా రిస్క్‌ తీసుకుంటున్నాను. ఈ సెప్టెంబర్‌ నుంచి కన్నప్ప షూటింగ్‌ ప్రారంభం కానుంది' అని పేర్కొన్నాడు.

చదవండి: మహేశ్‌తో కలిసి నటించనున్న నమ్రత.. రీఎంట్రీపై క్లారిటీ!
రూ.2 లక్షలిస్తానన్నా సరే, జబర్దస్త్‌ షోలో నటించను: కమెడియన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement