పెళ్లిలో మంచు మనోజ్ దంపతులు.. స్టార్ హీరో భార్యతో ఆసక్తికర సన్నివేశం! | Sakshi
Sakshi News home page

Manchu Manoj: పెళ్లిలో ఆసక్తికర సన్నివేశం..ఆమెకు భార్యను పరిచయం చేసిన మనోజ్!

Published Mon, Feb 19 2024 5:02 PM

Manchu Manoj Introduces About His Wife To Namrata Shirodkar - Sakshi

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఏపీకి చెందిన భూమా మౌనికను పెళ్లాడారు. హైదరాబాద్‌లోని మంచు లక్ష్మీ నివాసంలో వీరిద్దరి వివాహా వేడుక ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. ఇటీవలే ఈ జంట అభిమానులకు గుడ్‌ న్యూస్‌ కూడా చెప్పేసింది. త్వరలోనే మంచు మనోజ్ తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 

తాజాగా ఈ జంట హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యారు. అదే పెళ్లికి మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా వచ్చారు.  ఈ సందర్భంగా పెళ్లిలో తన భార్య మౌనికను నమ్రతకు పరిచయం చేశారు మనోజ్. నమ్రత కూడా మౌనికను దగ్గరికీ తీసుకుని మరి అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. మంచు మనోజ్ ప్రస్తుతం ఓ టీవీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement