Manchu Lakshmi Shares Manchu Manoj, Bhuma Mounika Wedding Video - Sakshi
Sakshi News home page

Manchu Manoj: మంచు మనోజ్‌ వెడ్స్‌ మౌనిక.. పెళ్లి వీడియో చూశారా?

Mar 6 2023 4:56 PM | Updated on Mar 6 2023 5:20 PM

Manchu Lakshmi Shares Manchu Manoj, Mounika Wedding Video - Sakshi

కొత్త జీవితాన్ని ప్రారంభించేముందు తండ్రి మోహన్‌బాబు పాదాలు తాకి ఆశీర్వాదాలు తీసుకున్నాడు మనోజ్‌. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న అపురూప ఘట్టం ఆవిష్కృతం కావడంతో మనోజ్‌, మౌనికల ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. మోహ

జీవితంలో ఎక్కడైనా ఓడిపోవచ్చు కానీ ప్రేమలో మాత్రం కాదు అంటున్న మంచు మనోజ్‌ తన ప్రేమను గెలిచాడు. ప్రేమించిన మౌనిక మెడలో మూడుముళ్లు కట్టి తనతో ఏడడుగులు నడిచాడు. పెళ్లి తర్వాత తొలిసారి భార్యతో కలిసి తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పటికే మనోజ్‌ మెహందీ ఫంక్షన్‌, కాక్‌టైల్‌ పార్టీ వీడియోను మంచు లక్ష్మి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా తెగ వైరల్‌ అయింది.

తాజాగా మధురమైన పెళ్లి క్షణాలను ట్విటర్‌లో షేర్‌ చేసింది మంచు లక్ష్మి. ఈ వీడియోలో మనోజ్‌ను పెళ్లికొడుకు చేసి తెగ మురిసిపోయింది. మరోవైపు మౌనికను పెళ్లికూతురుగా మండపంలోకి తీసుకొచ్చింది. కొత్త జీవితాన్ని ప్రారంభించేముందు తండ్రి మోహన్‌బాబు పాదాలు తాకి ఆశీర్వాదాలు తీసుకున్నాడు మనోజ్‌. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న అపురూప ఘట్టం ఆవిష్కృతం కావడంతో మనోజ్‌, మౌనికల ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. మోహన్‌బాబు చేతుల మీదుగా తాళి అందించడం.. దాన్ని భార్య మెడలో కట్టి మనోజ్‌ తన్మయత్వానికి లోనవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement