ప్రముఖ నటుడి ఇంట పెళ్లి.. డాక్టర్‌ వెడ్స్‌ ఇంజనీర్‌! | Malayalam Actor Baiju Santhosh Daughter Aishwarya Marriage Goes Viral | Sakshi
Sakshi News home page

Baiju Santhosh: మ్యాట్రిమోని ద్వారా పెళ్లి చేసుకున్న నటుడి కుమార్తె!

Published Mon, Apr 8 2024 5:05 PM | Last Updated on Mon, Apr 8 2024 5:20 PM

Malayalam Actor Baiju Santhosh Daughter Aishwarya Marriage Goes Viral - Sakshi

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. తాజాగా ప్రముఖ మలయాళ నటుడు బైజు సంతోష్ కూతురు, డాక్టర్‌ ఐశ్వర్వ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. చెన్నైలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న రోహిత్‌ను పెళ్లాడింది. తిరువనంతపురంలోని ప్రముఖ క్లబ్‌లో ఐశ్వర్య, రోహిత్ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పలువురు మలయాళ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. 

అయితే తన భర్త గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది ఐశ్వర్య. తమది ప్రేమ వివాహం కాదని.. రోహిత్‌ను మ్యాట్రిమోనీ సైట్‌లో చూసి పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది. అతని తల్లిదండ్రులు కేరళలోని పాతానంతిట్టకు చెందినవారు కాగా.. రోహిత్ పంజాబ్‌లో పుట్టి పెరిగారని తెలిపింది. నేను అతనితో ఒక్కసారి మాట్లాడాక.. నన్ను అర్థం చేసుకోగలడని అనిపించిందని ఐశ్వర్య పేర్కొంది. మరోవైపు పెళ్లి ప్రపోజల్ వచ్చినప్పుడు ఆమె మలయాళంలో పేరున్న నటుడి కూతురన్న విషయం తనకు తెలియదని రోహిత్ చెబుతున్నాడు. ఐశ్వర్య- రోహిత్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

కాగా.. బైజు సంతోష్‌కు ఐశ్వర్య పెద్దకూతురు. ఆమె ప్రస్తుతం ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. ఆమె పెళ్లికి ప్రియదర్శన్, షాజీ కైలాస్, అన్నీ, మేనక, సోనా నాయర్, కలడి ఓమన, డబ్బింగ్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మి హాజరయ్యారు. కాగా.. బైజు సంతోష్ మలయాళంలో మోహన్‌ లాల్ సూపర్ హిట్ మూవీ లూసిఫర్‌లో నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో గాడ్‌ ఫాదర్‌గా రీమేక్‌ చేశారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి నటించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement